కొవిడ్ వార్డును ముంచెత్తిన వర్షపు నీరు

| Edited By: Pardhasaradhi Peri

Oct 10, 2020 | 7:03 PM

కుండపోత వర్షాలకు ఓ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులోకి వర్షపునీరు వచ్చి చేరింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని అంబికాపూర్ మెడికల్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కొవిడ్ వార్డును ముంచెత్తిన వర్షపు నీరు
Follow us on

కుండపోత వర్షాలకు ఓ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులోకి వర్షపునీరు వచ్చి చేరింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని అంబికాపూర్ మెడికల్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొవిడ్ పేషెంట్స్ ఉన్న ఐసోలేషన్ వార్డులోకి నీరు వచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అత్యవసర వార్డులోకి నీరు రావడంతో కరోనా రోగులు, హెల్త్ వర్కర్స్ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కొవిడ్ వార్డు లోపల నుండి నీటిని బయటకు తీయడానికి వైద్యులతో సహా స్టాఫ్ నర్సులు కష్టపడుతున్నారు. భారీ వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నీటితో నిండిపోయి ఆస్పత్రిలోకి నీరు వచ్చి చేరిందని, పారిశుద్ధ్య కార్మికులు పనులు కొనసాగిస్తున్నారని అంబికాపూర్ నగర మేయర్ డాక్టర్ అజయ్ తిర్కీ తెలిపారు.