రేపే టీడీపీ శాసనసభాపక్ష సమావేశం..!

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ముఖ్య నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలి అనే దానిపై ఆయన పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఇకపోతే రేపు ఉదయం టీడీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని జరపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిననున్నారు. అంతేకాకుండా రేపు సాయంత్రం ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఎల్లుండి టీడీపీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ […]

రేపే టీడీపీ శాసనసభాపక్ష సమావేశం..!

Updated on: Jun 10, 2019 | 9:12 PM

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ముఖ్య నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలి అనే దానిపై ఆయన పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఇకపోతే రేపు ఉదయం టీడీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని జరపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిననున్నారు. అంతేకాకుండా రేపు సాయంత్రం ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఎల్లుండి టీడీపీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us