OTC Medicines: కేంద్రం కొత్త నిర్ణయం.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మందులు కొనుక్కునేందుకు వెసులుబాటు..

OTC Medicines: ఏదైనా మందులు కొనుగోలు చేయాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కానీ.. కొన్ని సాధారణంగా వినియోగించే మందుల విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తోంది.

OTC Medicines: కేంద్రం కొత్త నిర్ణయం.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మందులు కొనుక్కునేందుకు వెసులుబాటు..
Otc Medicines

Updated on: May 27, 2022 | 6:15 PM

OTC Medicines: ఏదైనా మందులు కొనుగోలు చేయాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కానీ.. కొన్ని సాధారణంగా వినియోగించే మందుల విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్‌లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓవర్-ది-కౌంటర్ (OTC) పద్ధతిలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా రిటైల్ మార్కెట్‌లో నేరుగా కొనుగోలు చేసేందుకు 16 రకాల మందులను అనుమతించాలని మొదటిసారిగా ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో పారాసెటమాల్ 500 Mg సాధారణ యాంటిపైరేటిక్ ఔషధం, కొన్ని లాక్సేటివ్‌లు, నాసల్ డీకోంగెస్టెంట్లు, యాంటీ ఫంగల్ క్రీమ్‌లను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ వినియోగదారులు మందుల దుకాణాల నుంచి నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించింది.

దీనికి సంబంధించిన ముసాయిదా సవరణపై నెల రోజుల్లోగా ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. దేశంలో పెద్ద సంఖ్యలో మందులు డాక్టర్ల నుంచి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీల్లో సులభంగా లభిస్తాయి. అయితే.. భారతదేశంలో OTC ఔషధ అమ్మకాల విషయంలో ఎలాంటి రూల్స్ లేవు. ఈ ఏడాది ప్రారంభంలో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, మందులపై ప్రభుత్వ అత్యున్నత సలహా మండలి కొత్త ఓటీసీ పాలసీకి ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖలోని అధికారులు వెల్లడించారు.

ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. మెడికల్ షాపులు వినియోగదారునికి కేవలం ఐదు రోజులకు సరిపడా మందులను మాత్రమే విక్రయించాలి. ఒక వేళ లక్షణాలు తగ్గకపోతే సదరు రోగి వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని షరతులను పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us