సీబీఐని తికమక పెట్టిన రియా పొరుగింటావిడ

సుశాంత్ కమ్ డ్రగ్స్ కేసులో ఈ మధ్యే బెయిల్ పై విడుదలైన రియా చక్రవర్తి ఇంటి పక్కనే ఉన్నానని చెప్పుకున్న ఓ మహిళ. సీబీఐని  తికమక పెట్టింది. డింపుల్ థావనీ అనే ఈమె తాను గత జూన్ 13 న రియా, సుశాంత్ లను చూశానని సీబీఐ అధికారులకు తెలిపింది. అయితే వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో, తాను వారిని చూడలేదని, ఎవరో చెబితే విన్నానని చెప్పింది. అంతేకాదు.. వాళ్లిద్దరూ వెళ్తుంటే ఎవరో చూసి తనకు ఈ […]

సీబీఐని తికమక పెట్టిన రియా పొరుగింటావిడ

Edited By:

Updated on: Oct 11, 2020 | 8:09 PM

సుశాంత్ కమ్ డ్రగ్స్ కేసులో ఈ మధ్యే బెయిల్ పై విడుదలైన రియా చక్రవర్తి ఇంటి పక్కనే ఉన్నానని చెప్పుకున్న ఓ మహిళ. సీబీఐని  తికమక పెట్టింది. డింపుల్ థావనీ అనే ఈమె తాను గత జూన్ 13 న రియా, సుశాంత్ లను చూశానని సీబీఐ అధికారులకు తెలిపింది. అయితే వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో, తాను వారిని చూడలేదని, ఎవరో చెబితే విన్నానని చెప్పింది. అంతేకాదు.. వాళ్లిద్దరూ వెళ్తుంటే ఎవరో చూసి తనకు ఈ విషయం చెప్పారని కూడా ఆమె తెలిపింది. ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేసిన సీబీఐ, అబద్దాలు చెప్పవద్దని, ఎవరో చెప్పినదాన్ని నిజమో కాదో నిర్ధారించుకోకుండా వాగవద్దని గట్టి అల్టిమేటం ఇచ్చారు. ఇదెక్కడి మేళం అని నిట్టూర్చారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us