ఫ్రెంచ్ టెక్ దిగ్గజం క్యాప్‌జెమిని భారత టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల కోత విధిస్తున్న తరుణంలో క్యాప్‌జెమిని సంస్థ భారీగా రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనుంది. దీంతో ఇండియన్ టెక్కీలకు ప్రయోజనం కలగనుందంటున్నారు మార్కెట్ నిపుణులు.
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మందగమనం నేపథ్యంలో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి చాలా కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పులు సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను తీసుకొన్న తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయాన్ని టెక్కీలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండియాకు చెందిన టెక్కీలపై, సాఫ్ట్‌వేర్ కంపెనీలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్యాప్‌జెమిని ఇండియా చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్‌కి ఊరటనిస్తోంది.
క్యాప్‌జెమిని సంస్థకు ఇప్పటికే భారత్‌లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో అనుభవవజ్ఞులతో పాటు ప్రెషర్స్‌కు కూడా ఈ నియామకాల్లో అవకాశం కల్పించిననున్నట్టు క్యాప్‌జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ ప్రకటించారు. తమ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నవారిలో భారత్‌లోనే సగం మంది ఉన్నారన్నారని స్పష్టం చేశారు. తమ వ్యాపారంలో భారత్‌ది కీలకమైన భాగమని యార్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో నూతన సాంకేతికతపై నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టామని చెప్పారు.