ప్రపంచంలో కరోనా ‘ఫ్రీ’ గా మరోదేశం.. నెలరోజులుగా..!

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి. కాగా.. ప్రపంచంలో కరోనా లేని మరో

ప్రపంచంలో కరోనా ఫ్రీ గా మరోదేశం.. నెలరోజులుగా..!

Edited By:

Updated on: May 18, 2020 | 2:22 PM

Cambodia as Coronavirus free: కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి. కాగా.. ప్రపంచంలో కరోనా లేని మరో దేశంగా కంబోడియా నిలిచింది. ఆ దేశంలో మొత్తం 122 కేసులు నమోదు కాగా.. వైరస్ సోకినా అందరూ కోలుకున్నారు. ఏ ఒక్కరు కూడా మరణించలేదు.

దీంతో తమ దేశంకరోనా ఫ్రీ గా మారిందని కంబోడియా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. కాగా.. లాక్ డౌన్ ఆంక్షలను మాత్రం ఎత్తివేసేది లేదని వివరించారు. సరిహద్దులతో పాటు పోర్టులు, చెక్ పోస్టులు, విమానాశ్రయాలు మూసివేసినట్లు తెలిపారు. అయితే.. గత నెల రోజులుగా అక్కడ ఒక్క కొత్త కరోనా కేసు నమోదు కాలేదని మంత్రి తెలిపారు.

Also Read: బ్రేకింగ్: లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించిన ఏపీ..