Business Idea: కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైపోయింది. అంతేకాకుండా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగ సమస్య ఎక్కువయ్యింది. దీంతో చాలా మంది యువత ఉద్యోగాలు లేక వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. వీరిలో కొందరు వ్యవసాయాన్ని నమ్ముకుంటే.. మరికొందరు వ్యాపారం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే వ్యాపారం ఉంటే ఎవరు మాతా్రం ఇంట్రెస్ట్ చూపరు. ప్రస్తుతం దేశంలో చాలా మంది పుట్టగొడుగుల వ్యాపారంతో లక్షలు సంపాదింస్తున్నారు.
పుట్టగొడుగు వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపోందించేందుకు కూడా ఇది తోడ్పతుంది. విదేశాల్లో దీనిని ఎక్కువగా తింటుంటారు. రెస్టారెంట్లు, హోటళ్లులలో ఈ పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రస్తుతం యూవత ఈ పుట్టగొడుగుల వ్యాపారం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిని ఎలా పండించాలి అనే పద్ధతులను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నారు. బటన్ పుట్టగొడుగులో విటమిన్లు పుష్కలంగా ఉండాలి. ఈ కారణంగానే ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర కిలోకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. అలాగే టోకు ధర రూ.40 శాతం తక్కువగా ఉంటుంది. వీటి ధర అమాంతం పెరుగుతుండడంతో చాలా మంది రైతులు వ్యవసాయంతోపాటు ఈ బటన్ పుట్టగొడుగుల వ్యాపారంలోకి దిగుతున్నారు.
✶ముందుగా ఈ బటన్ పుట్టగొడుగల సాగుకు కంపోస్ట్‌ను తయారు చేసుకోవాలి. ఒక క్వింటాల్ కంపోస్ట్‌కు 1.5 కిలోల విత్తనాల వరకు సరిపోతాయి. అలాగే 4 నుంచి 5 క్వింటాళ్ళ కంపోస్ట్ తయారు చేసుకుంటే అందులో దాదాపు 2000 కిలోల పుట్టగొడుగులను పండించవచ్చు. 2000 కిలోల పుట్టగోడుగులను కిలోకు రూ.150 అమ్మినా.. దాదాపు రూ.3 లక్షల వరకు సంపాందించవచ్చు. అంటే మీరు రూ.50 వేల వరకు పెట్టుబడి పెడితే.. తిరిగి మీరు రూ.2.50 లక్షలు సంపాందించవచ్చు.
పుట్టుగొడుగలను ఎలాంటి ప్రదేశంలో పండిచాలి…
ఒక చదరపు మీటరు స్థలంలో దాదాపు 10 కిలోల పుట్టగొడుగులను పెంచవచ్చు. అంటే మీకు కనీసం 40 × 30 అడుగుల స్థలంలో మూడు నుంచి మూడు అడుగుల వెడల్పు ఉన్న అరలను తయారు చేసి అందులో పుట్టగొడుగులను పండించవచ్చు.
Also Read: