బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఏడుగురికి గాయాలు

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. నాగ్ని గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Edited By:

Updated on: May 16, 2019 | 1:38 PM