బడ్జెట్ 21, ‘కరోనా రిలీఫ్’, ప్రజలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుందా, హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి ?

| Edited By: Ram Naramaneni

Jan 31, 2021 | 7:05 PM

కోవిద్ 19  దేశ వ్యాప్తం,గా ఆందోళనను  రేకెత్తించింది. దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపు క్షీణించే పరిస్థితిని సృష్టించింది.

బడ్జెట్ 21, కరోనా రిలీఫ్, ప్రజలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుందా, హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి ?
Follow us on

కోవిద్ 19  దేశ వ్యాప్తం,గా ఆందోళనను  రేకెత్తించింది. దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపు క్షీణించే పరిస్థితిని సృష్టించింది. అయితే ఇదే సమయంలో ప్రజలందరికీ ప్రభుత్వం తప్పనిసరిగా హెల్త్ ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని  కలుగజేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇప్పటికే కొత్త మ్యుటెంట్ స్ట్రెయిన్ కూడా వణికిస్తున్న నేపథ్యంలో.. రానున్న కొత్త బడ్జెట్ లో ప్రభుత్వం ఆరోగ్య  బీమాకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. హెల్త్ చెకప్ పై టాక్స్ మినహాయింపు కింద వ్యాక్సినేషన్ కాస్ట్ ని కూడా చేరిస్తే ఇదెంతో ఊరట కలిగించినట్టవుతుందని అంటున్నారు. దీనివల్ల ప్రజలకు ఈ వెసులుబాటును కల్పించడమే కాక.. పన్ను చెల్లింపుదారులపై భారం కూడా తగ్గుతుంది. పరోక్ష పన్నుల ద్వారా ఓ వైపు నిధులను సమీకరిస్తూనే మరో వైపు ఈ విధమైన చర్యలు తీసుకున్న పక్షంలో బడ్జెట్ ముఖ్యంగా సామాన్యులకు ప్రయోజనకారి అవుతుందని అంటున్నారు.