Telangana: నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.. గవర్నర్ తీరుపై బీఆర్ఎస్‌ నేతల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు.. మరోసారి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్‌ చేశారు.

Telangana: నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.. గవర్నర్ తీరుపై బీఆర్ఎస్‌ నేతల ఆగ్రహం
Cm Kcr, Governor Tamilisai

Updated on: Mar 13, 2023 | 3:31 PM

తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు.. మరోసారి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్‌ చేశారు. యూనివర్సిటీలో నియమకాలపై బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శలు గుప్పించారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లును ఆమోదించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దాదాపు 10లక్షల ఖాళీలు ఉన్నాయని పార్లమెంట్ లో ప్రభుత్వమే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు.. మరోవైపు గవర్నర్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ బిల్లు కు ఆమోదం చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్‌ నేతలు.

బిల్లును నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం వెనక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. యువత తరుపున గవర్నర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం.. ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించాలని.. గవర్నర్ కు సూచించారు.

కాగా.. గత కొంతకాలం నుంచి గవర్నర్.. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం ముదురుతూ వస్తున్న విషయం తెలిసిందే. విమర్శలతో మొదలైన వ్యవహారం.. పెండింగ్ బిల్లుల వరకు చేరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us