Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది

ఈ మధ్య పీటల దాకా వచ్చి పెటాకులు అయిన పెళ్లిళ్ల ఘటనలు అనేకం చూశాం. ఆ మధ్య ఒక వధువు అందరిముందే తన ప్రియుడికి ముద్దు ఇచ్చింది.

Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది...అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది

Updated on: Dec 25, 2020 | 11:18 AM

Variety marriage :  ఈ మధ్య పీటల దాకా వచ్చి పెటాకులు అయిన పెళ్లిళ్ల ఘటనలు అనేకం చూశాం. ఆ మధ్య ఒక వధువు అందరిముందే తన ప్రియుడికి ముద్దు ఇచ్చింది. తాజాగా ఓ యువతి పెళ్లి పీటల పైన కూర్చుని తాను తాళి కట్టించుకోనని మొండికేసింది. తన ప్రియుడు వస్తాడంటూ హడావిడి చేసింది. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో వధువు చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి మండపం బంధుమిత్రులతో కోలహలంగా ఉంది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఆనందంలో తేలియాడుతున్నారు. వధూవరులు పెళ్లిపీటలపై కూర్చొని ఉండగా, పురోహితుడు పెళ్లి తంతు జరిపిస్తున్నాడు. కొద్ది సేపట్లో తాళికట్టే సుముహూర్తం సమీపిస్తుందనగా, పెళ్లి మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి ఆపాలని సూచించడంతో అందరూ షాకయ్యారు. పెళ్లి కూతురే పోలీసులను పిలిపించి పెళ్లి ఆపించినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ గురువారం ఈ విచిత్ర ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అప్పటికే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆ యువతి… పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేని వధువు ఏకంగా పెళ్లి మండపం నుంచే పోలీసులకు ఫోన్‌ చేసింది. ఈ పెళ్లిని ఎలాగైనా నిలిపివేయాలని వేడుకుంది. స్పందించిన మరిపెడ సీఐ‌ సాగర్‌, ఎస్సై అశోక్‌ పెళ్లి మండపం వద్దకు వచ్చి..పెళ్లి ఆపి.. విచారణ చేపట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా యువతి వినకపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. అనంతరం యువతిని పోలీసులు కౌన్సెలింగ్‌ కోసం సఖి సెంటర్‌కు తరలించారు. అంతమంది అతిథుల మధ్యలో పెళ్లి ఆగడం అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు వివాహానికి హాజరైన సమీప బంధువుల అమ్మాయితో అదే మండపంలో పెళ్లి చేయడం గమనార్హం.

Also Read : Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ

Loading...
Unable to load recommendations.
Follow Us