ప్రియురాలి గురకకు చెక్‌ పెట్టేందుకు ప్రియుడి వినూత్న ప్రయోగం

| Edited By:

Sep 22, 2020 | 1:16 PM

గురక చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అది బాధితుడిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.

ప్రియురాలి గురకకు చెక్‌ పెట్టేందుకు ప్రియుడి వినూత్న ప్రయోగం
Follow us on

Lover Bizarre Hack: గురక చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అది బాధితుడిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.. పక్కనున్న వారిని ఇబ్బంది పెడుతుంది. ఇలా ప్రియురాలి గురకతో ఇబ్బంది పడిన ఓ ప్రియుడు.. దానికి చెక్ పెట్టేందుకు ఓ వినూత్న ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. సక్సెస్ అయినందుకు అతడు చాలా సంతోషపడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల జాన్‌ అబ్రహం అనే వ్యక్తి,  షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు.  షార్నికి  నిద్రలో గురకపెట్టే అలవాటు ఉండటంతో.. జాసన్ చాలా నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆ గురక శబ్దం తనను ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రయోగాలు చేశాడు. అయితే అవేవీ పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఇక చివరగా ఓ వినూత్న ప్రయోగం చేశాడు.

అదేంటంటే షార్ని గురక పెట్టే సమయంలో అతడు ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆగేది. ఇలా వారం రోజు పాటు జాసన్ అదే పని చేయగా.. క్రమంగా ఆమె గురక తగ్గిపోయింది. దీంతో ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఇక ఈ విషయాన్ని జాసన్ చాటింగ్‌లో షార్నికి చెప్పాడు. అందుకు షార్ని.. అందుకేనా కొన్ని సార్లు లేచిన తరువాత నా మొహం జిగటగా ఉండేది అంటూ కామెంట్ పెట్టింది.