రైతుల ఆందోళన వెనుక ‘తుక్ డే తుక్ డే గ్యాంగ్’, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఫైర్,

రైతుల ఆందోళన వెనుక తుక్ డే తుక్ డే గ్యాంగ్ వెనుక ఉందని, ఆ 'గ్యాంగ్' ఢిల్లీని మరో షాహీన్ బాగ్ ధర్నా స్థలిగా మార్చాలని చూస్తోందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఈ ఏడాది కోవిడ్ పాండమిక్ ముందు..

రైతుల ఆందోళన వెనుక 'తుక్ డే తుక్ డే గ్యాంగ్', బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఫైర్,
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 03, 2020 | 12:05 PM

రైతుల ఆందోళన వెనుక తుక్ డే తుక్ డే గ్యాంగ్ వెనుక ఉందని, ఆ ‘గ్యాంగ్’ ఢిల్లీని మరో షాహీన్ బాగ్ ధర్నా స్థలిగా మార్చాలని చూస్తోందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఈ ఏడాది కోవిడ్ పాండమిక్ ముందు.. ఫిబ్రవరిలో సీఏఎ కి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద వందలాది నిరసనకారులు నెల రోజులపైగా ధర్నా చేసిన జానాతి తెలిసిందే. డే విషయాన్ని మనోజ్ తివారీ గుర్తు చేస్తూ..రైతుల్లో కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం, ప్రధానికి ముప్పు తెస్తామని హెచ్చరించడం చూస్తే ఇదంతా దేశంలో అశాంతిని సృష్టించేందుకు పకడ్బందీగా పన్నిన కుట్రలా కనబడుతోందని ఆయన అన్నారు. అసలైన అన్నదాతలు ఈ చట్టాలను అర్థం చేసుకుని ఆందోళనచేస్తున్నవారిలోని అపోహలను పోగొట్టాలని ఆయన కోరారు.

నగరంలో షాహీన్ బాగ్ 2.0 ఏర్పడే పరిస్థితి రాకుండా చూడాలని మనోజ్ తివారీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా అకాలీదళ్ కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైఖరిని తప్పు పట్టింది. ఓ వైపు ఈ ప్రభుత్వం  రైతు చట్టాలను అమలు చేస్తూ మరోవైపు వారి ఆందోళనను రెచ్ఛగొడుతోందని దళ్ నేతలు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకోసం ఆప్ పార్టీ ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని వారు విమర్శించారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే రైతు చట్టాలను ఎందుకు అమలు చేస్తుందన్నారు.కేజ్రీవాల్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మనస్ఫూర్తిగా అన్నదాతల నిరసనకు మద్దతునివ్వాలని అకాలీదళ్ కోరింది.

Latest Articles