అమ్మో…! భయమేస్తోంది… ఎలా నటించేది..?

|

Jul 13, 2020 | 8:19 PM

కరోనా మహమ్మారితో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోరాడుతున్నారు. ముంబై వంటి మహానగరాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండటంతో బాలీవుడ్ నటులను షేక్ చేస్తోంది. తాజాగా అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం ఒకేసారి కొవిడ్ రక్కసికి చిక్కడంతో అందిరిలోనూ భయం మొదలైంది. ఇంట్లో ఉంటేనే వైరస్ ప్రభావం ఇంతలా ఉంటే.. మరి షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటుందో అని భయపడుతోంది సినిమా ప్రపంచం. ఈ నేపథ్యంలో నటి బిపాసా బసు ట్విట్టర్ ద్వారా ఆసక్తికర కామెంట్ […]

అమ్మో...! భయమేస్తోంది... ఎలా నటించేది..?
Follow us on

కరోనా మహమ్మారితో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోరాడుతున్నారు. ముంబై వంటి మహానగరాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండటంతో బాలీవుడ్ నటులను షేక్ చేస్తోంది. తాజాగా అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం ఒకేసారి కొవిడ్ రక్కసికి చిక్కడంతో అందిరిలోనూ భయం మొదలైంది.

ఇంట్లో ఉంటేనే వైరస్ ప్రభావం ఇంతలా ఉంటే.. మరి షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటుందో అని భయపడుతోంది సినిమా ప్రపంచం. ఈ నేపథ్యంలో నటి బిపాసా బసు ట్విట్టర్ ద్వారా ఆసక్తికర కామెంట్ చేశారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటులకు ఎక్కువగా ఉంటుందని అన్నారు. యూనిట్‌లోని ఇతరులందరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులను ధరిస్తారని… అయితే యాక్టర్లు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా నటించాల్సి ఉంటుందని అన్నారు. అలాంటి సమయంలో ఈ కనిపించని మహమ్మారి దాడి చేస్తే ఎలా  అని  ప్రశ్నించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు.