నేడు బిహార్లో ఎన్డీయే పక్షాల సమావేశం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ, ఆ ఫార్ములాలతో ముందుకు !

|

Nov 15, 2020 | 10:13 AM

బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి . జేడీయూ-బీజేపీలో కూడిన ఎన్డీఏ.. మరోసారి అధికార పగ్గాలు అందుకోబోతోంది.

నేడు బిహార్లో ఎన్డీయే పక్షాల సమావేశం,  ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ, ఆ ఫార్ములాలతో ముందుకు !
Follow us on

బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జేడీయూ-బీజేపీలో కూడిన ఎన్డీఏ.. మరోసారి అధికార పగ్గాలు అందుకోబోతోంది. సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సభా పక్ష నేతను ఎన్నుకోవడానికి ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా నేడు సమావేశం నిర్వహించనున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఆ భేటీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గాన్ని ఈ భేటీలో ఫైనల్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

బీజేపీ తరుఫున ఈ భేటీకి  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు మరికొందరు సీనియర్లు  హాజరుకానున్నారు. స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినందున.. ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనే విషయంపై నాయకులు చర్చించనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు కేటాయించాల్సిన పదవులపై కూడా చర్చించనున్నారు.

కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎన్డీఏ నేతలు ఏపీ సీఎం జగన్ ఫార్ములాను అనుసరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తారని చెబుతున్నారు. నితీష్ కుమార్ కేబినెట్‌లో ముగ్గురు డిప్యూటీ సీఎంలను తీసుకోవచ్చని అంటున్నారు. ఇక కొత్త మంత్రివర్గం ఏర్పాటులో మహారాష్ట్ర ఫార్ములాను ఎన్డీఏ అనుసరించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Also Read :

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్

‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై సీఎం ఫోకస్, నేడు సంబంధిత అధికారులతో కీలక భేటీ