ఇసుక సమస్యకు సత్వర పరిష్కారాలు ఏంటి?..బిగ్ న్యూస్..బిగ్ డిబేట్

|

Oct 30, 2019 | 11:33 PM

ఏపీ ఇసుకపై రాజకీయ పంచాయితీ కాకరేపుతోంది. విపక్షాలు ఈటెల్లాంటి ప్రశ్నలతో సమరానికి సై అంటుంటే, ప్రభుత్వం వారోత్సవాలకు రెడీ అవుతోంది. అధికారపార్టీ నేతలు ఇసుక కొరత సృష్టించారన్న టీడీపీ పాత విమర్శకు- వైసీపీ కొత్త కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ మాఫియా గ్రామాల్లోకి ఇసుక రాకుండా అడ్డుకుంటోందన్నది అధికారపార్టీ ఆరోపణ. భవన నిర్మాణ కార్మికుల గురించి విపక్షాలు గొంతెత్తుతుంటే, ఆ నిధుల్ని టీడీపీ సర్కార్‌ దారిమళ్లించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇసుక కొరతపై ఇప్పటికే టీడీపీ, సీపీఐలు పోరాటం సాగిస్తూ […]

ఇసుక సమస్యకు సత్వర పరిష్కారాలు ఏంటి?..బిగ్ న్యూస్..బిగ్ డిబేట్
Follow us on

ఏపీ ఇసుకపై రాజకీయ పంచాయితీ కాకరేపుతోంది. విపక్షాలు ఈటెల్లాంటి ప్రశ్నలతో సమరానికి సై అంటుంటే, ప్రభుత్వం వారోత్సవాలకు రెడీ అవుతోంది. అధికారపార్టీ నేతలు ఇసుక కొరత సృష్టించారన్న టీడీపీ పాత విమర్శకు- వైసీపీ కొత్త కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ మాఫియా గ్రామాల్లోకి ఇసుక రాకుండా అడ్డుకుంటోందన్నది అధికారపార్టీ ఆరోపణ. భవన నిర్మాణ కార్మికుల గురించి విపక్షాలు గొంతెత్తుతుంటే, ఆ నిధుల్ని టీడీపీ సర్కార్‌ దారిమళ్లించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇసుక కొరతపై ఇప్పటికే టీడీపీ, సీపీఐలు పోరాటం సాగిస్తూ ఉండగా..జనసేన, బీజేపీలు త్వరలోనే నిరసన దీక్షలకు దిగబోతున్నాయి. ఇక ఇదే ఇష్యూపై టీవీ9 బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్చ జరిగింది. దాంట్లో ఇసుక కొరతకు సత్వర పరిష్కారాలకు సంబంధించి ఏపీలోకి విపక్ష పార్టీలకు చెందిన నాయకులు కొన్ని పరిష్కారాలు సూచించారు. వాటిపై అధికారపార్టీ ఏ విధంగా స్పందించిందనే విషయాలు దిగువ వీడియోలో..

;