నా మీద నాకు చాలా న‌మ్మ‌కం…

|

Oct 23, 2020 | 6:04 PM

ఐపీఎల్ 13వ సీజన్‌లో దూకుడు మీదున్న డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ అయిన శిఖ‌ర్‌ధావ‌న్ సంచనల ప్రకటన చేశాడు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడుతున్న ధావ‌న్ తొలి రెండు మ్యాచ్‌ల‌లో 20ల స్కోరుకే ఔట‌య్యాడు...

నా మీద నాకు చాలా న‌మ్మ‌కం...
Follow us on

Shikhar Dhawan : ఐపీఎల్ 13వ సీజన్‌లో దూకుడు మీదున్న డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ అయిన శిఖ‌ర్‌ధావ‌న్ సంచనల ప్రకటన చేశాడు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడుతున్న ధావ‌న్ తొలి రెండు మ్యాచ్‌ల‌లో 20ల స్కోరుకే ఔట‌య్యాడు. కానీ ఇప్పుడు రెండు వ‌రుస సెంచ‌రీలు కొట్టి 465 ప‌రుగుల‌తో ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ నేప‌థ్యంలో ధావ‌న్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నాడు. తన ఆట గురించి ఇత‌రులు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని తాను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని చెప్పుకొచ్చాడు.  నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండ‌ట‌మే ఇష్టమని తెలిపాడు. ఒత్త‌డిలో ఉండ‌టం న‌చ్చ‌దని తెలిపాడు.

ముందుగా ఇత‌రులు నా గురించి ఏమ‌నుకుంటున్నారు అనే విష‌యాన్ని నేను ప‌ట్టించుకోను. రెండోది నేను ఆట‌ను ఎక్కువ‌గా ప్రేమిస్తాను. అది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నేను ఆట కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతానో నాకు తెలుసు. అంతేకాదు, ఓ విష‌యంలో నా మీద నాకు చాలా న‌మ్మ‌కం ఉన్న‌ది. అదేమిటంటే నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుందని ధావ‌న్ ధీమా వ్యక్తం చేశాడు డ్యాషంగ్ గబ్బర్.