బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టు.!

|

Nov 11, 2020 | 5:22 PM

మరో ఐదు నెలలలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈసారి మరో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టు.!
Follow us on

IPL 2021: ఎన్నో అవాంతరాలు, ఇంకెన్నో సంచలనాల నడుమ ఐపీఎల్ 13వ సీజన్ విజయవంతంగా ముగిసింది. కరోనా కారణంగా వినోదానికి దూరమైన క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ లీగ్‌ 100 శాతం ఎంటర్‌టైన్మెంట్‌ను పంచింది. ఇక మరో ఐదు నెలలలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021లో ఓ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి మరో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఐపీఎల్ 14వ సీజన్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటాయట. గుజరాత్‌ తరుపున ఓ టీం బరిలోకి దిగబోతోందని.. అంతేకాకుండా వారి హోం గ్రౌండ్ అతి పెద్ద మోతేరా క్రికెట్ స్టేడియం కాబోతోందని టాక్. ఈ స్టేడియంలో లక్షా 10 వేల మందికి సీటింగ్ కెపాసిటీ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ మెగా వేలం ఉండనుందని తెలుస్తోంది. కరోనా తెచ్చిన ఆర్ధిక లోటును పూడ్చేందుకు బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం.