హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ మృతి

| Edited By: Ravi Kiran

Jan 27, 2020 | 12:48 PM

పాపులర్ బాస్కెట్ బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. లాస్ఏంజిలిస్‌లోని కలా‌బాసాస్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన 13 ఏళ్ళ కుమార్తె జియానా కూడా మృతి చెందింది. వీరితో బాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న సీకోర్సికీ ఎస్-76 హెలికాఫ్టర్ ఓ కొండను ఢీకొని మంటల్లో మండుతూ కూలిపోయింది. దట్టమైన మంచుతో కూడిన వాతావరణం అనుకూలించకపోవడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఆరెంజ్ కౌంటీ […]

హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్  మృతి
Follow us on

పాపులర్ బాస్కెట్ బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. లాస్ఏంజిలిస్‌లోని కలా‌బాసాస్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన 13 ఏళ్ళ కుమార్తె జియానా కూడా మృతి చెందింది. వీరితో బాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న సీకోర్సికీ ఎస్-76 హెలికాఫ్టర్ ఓ కొండను ఢీకొని మంటల్లో మండుతూ కూలిపోయింది. దట్టమైన మంచుతో కూడిన వాతావరణం అనుకూలించకపోవడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఆరెంజ్ కౌంటీ కాలేజ్ బేస్ బాల్ కోచ్ జాన్ అల్టోబెల్లి, ఆయన భార్య కేరి, వారి కూతురు అలీసా కూడా ఉన్నారు. 41 ఏళ్ళ కోబ్ బ్రయంట్.. బాస్కెట్ బాల్ క్రీడలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అయిదు సార్లు ఎస్‌బీ‌ఏ ఛాంపియన్‌గా గెలిచారు. రెండు సార్లు ఒలంపిక్ స్వర్ణ పతకాలను సాధించారు. పైగా తన కూతురు జియానాకు కూడా ఈ క్రీడలో మంచి  శిక్షణ   ఇచ్చారు.   తన సొంత హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతానని ఆయన ఏనాడూ ఊహించలేదు. కోబ్ మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రగాఢ సంతాపం:

కోబ్ బ్రయంట్ మృతి పట్ల ఇండియన్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న వీరు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ వార్త తమనెంతో బాధ కలిగించిందని’ పేర్కొన్నారు. ఇది చాలా విషాదకర దినమని రోహిత్ శర్మ అన్నాడు. వీరితో బాటు అభిషేక్ బచ్చన్, లారా దత్తా, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. 2016 లోనే రిటైర్మెంట్ తీసుకున్న కోబ్…   బాస్కెట్ బాల్ క్రీడా చరిత్రలోనే ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్నాడని వీరు పేర్కొన్నారు.