బ‌హ్రెయిన్‌లో క‌రోనా కలకలం..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గ‌ల్ఫ్ దేశ‌మైన బ‌హ్రెయిన్‌లో మ‌హ‌మ్మారి క‌ల్లోలం సృష్టిస్తోంది. బుధ‌వారం ఒక్క‌రోజే 519 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఈ కొత్త కేసుల్లో ప్రవాస కార్మికులు 293 మంది ఉంటే

బ‌హ్రెయిన్‌లో క‌రోనా కలకలం..!
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 3:02 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గ‌ల్ఫ్ దేశ‌మైన బ‌హ్రెయిన్‌లో మ‌హ‌మ్మారి క‌ల్లోలం సృష్టిస్తోంది. బుధ‌వారం ఒక్క‌రోజే 519 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఈ కొత్త కేసుల్లో ప్రవాస కార్మికులు 293 మంది ఉంటే… 221 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న వారి నుంచి సోక‌గా… మ‌రో ఐదుగురు ట్రావెల్ హిస్ట‌రీ ఉన్న‌వారు అని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇవాళ 403 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 21,331కు చేరింది.

అయితే.. బుధ‌వారం మూడు కొత్త మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హ్రెయిన్ వ్యాప్తంగా కోవిడ్‌-19 వ‌ల్ల చ‌నిపోయిన వారు 87 మంది అయ్యారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 5,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే… ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 5 లక్ష‌లకు పైగా మందిని క‌బ‌ళించింది. అలాగే కోటికి పైగా మందికి సోకింది.