జీడిమెట్లలో దారుణం.. అనుమానం ఆమె పాలిట పెనుభూతమైంది.. కన్నతల్లిని కడతేర్చిన తనయుడు..

|

Dec 28, 2020 | 7:12 AM

అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనుమానంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ కొడుకు. తల్లి ఇతర వ్యక్తితో చనువుగా ఉంటుందన్న కారణంతో విచక్షణ కోల్పోయిన కొడుకు కిరాతకుడిగా మారిన ఘటన హైదరాబాద్ మహానగర శివారులో చోటుచేసుకుంది.

జీడిమెట్లలో దారుణం.. అనుమానం ఆమె పాలిట పెనుభూతమైంది.. కన్నతల్లిని కడతేర్చిన తనయుడు..
Follow us on

అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనుమానంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ కొడుకు. తల్లి ఇతర వ్యక్తితో చనువుగా ఉంటుందన్న కారణంతో విచక్షణ కోల్పోయిన కొడుకు కిరాతకుడిగా మారిన ఘటన హైదరాబాద్ మహానగర శివారులో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ(40) కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఆమె కొంత కాలంగా ఓ వ్యక్తితో చనువుగా ఉంటోంది. అయితే ఆమె అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానంతో ఆమె కుమారుడు ఆటో డ్రైవర్‌(24) అతిదారుణంగా హతమార్చాడు. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో తల్లి కొడుకుల మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన కొడుకు.. తల్లి మెడకు దుప్పటి చుట్టి గొంతు పిసికి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.