స్వదేశీ జెర్సీతో మెరువనున్న ఆసీస్ జట్టు

|

Nov 11, 2020 | 6:55 PM

భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు రెడీ అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న టీ20 సిరీస్​ కోసం ఆసీస్​ ఆటగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ జెర్సీలను ధరించనున్నారు.

స్వదేశీ జెర్సీతో మెరువనున్న ఆసీస్ జట్టు
Follow us on

Indigenous jersey :  భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు రెడీ అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న టీ20 సిరీస్​ కోసం ఆసీస్​ ఆటగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ జెర్సీలను ధరించనున్నారు.

అయితే తొలిసారి ఈ జెర్సీని ధరించిన ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్ స్టార్క్​ సంతోషం వ్యక్తం చేశాడు. స్వదేశీ జెర్సీని ధరించేందుకు తామెంతో ఉత్సుకతతో ఉన్నామని స్టార్క్​ పేర్కొన్నాడు. ఈ కొత్త జెర్సీని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డ్  ఆవిష్కరించింది. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి ఆసీస్​ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా స్వదేశీ జెర్సీలను తయారు చేశారు. అయితే ఈ జెర్సీపై ఉన్న పెయింటిగ్స్ చాలా సందేశాత్మకంగా ఉంది. అందుకు సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ వివరిస్తూ ఓ ట్వీట్ చేసింది.

భారత్​, ఆస్ట్రేలియా మధ్య నవంబరు 27 నుంచి ద్వైపాక్షిక సిరీస్​ ప్రారంభం కానుంది. ముందుగా మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టులను ఆడనున్నారు. డిసెంబరు 4న టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది.