Rohit Sharma: ఎంజాయ్ మూడ్‌లో టీమిండియా ఆటగాళ్లు… చెమటోడుస్తున్న హిట్‌మ్యాన్…

రెండో టెస్ట్‌లో అద్భుత విజ‌యాన్ని టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ శ‌ర్మ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Rohit Sharma: ఎంజాయ్ మూడ్‌లో టీమిండియా ఆటగాళ్లు... చెమటోడుస్తున్న హిట్‌మ్యాన్...

Edited By:

Updated on: Dec 31, 2020 | 11:41 PM

రెండో టెస్ట్‌లో అద్భుత విజ‌యాన్ని టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ శ‌ర్మ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ అనంతరం ఆసీస్‌ చేరుకున్న రోహిత్‌ 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకొని ఇటీవలే టీమ్‌తో కలిసిన విషయం తెలిసిందే. కాగా జనవరి 7 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మ్యాచ్‌కు ఇంకా వారం సమయం ఉండడంతో టీమిండియా ఎంజాయ్‌ మూడ్‌లో ఉంది. రోహిత్‌ మాత్రం మెల్‌బోర్న్‌ మైదానంలో ప్రాక్టీస్‌ కొనసాగించాడు. కొద్దిసేపు బ్యాటింగ్‌.. ఆ తర్వాత క్యాచ్‌ల సాధన చేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఐపీఎల్‌లో గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌తోపాటు తొలి రెండు టెస్ట్‌ల‌కు రోహిత్ దూర‌మ‌య్యాడు.

 

బీసీసీఐ ట్వీట్ ఇదే…

 

Also Read:

Rohit Sharma : సిడ్నీలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. మూడో టెస్టుకు అందుబాటులో హిట్‌మ్యాన్