భారీ ఉల్క.. రెండురోజుల్లో భూమికి అత్యంత సమీపంగా..

| Edited By:

Jun 22, 2020 | 5:42 PM

మయాన్ క్యాలెండర్‌ వాదన ప్రకారం 2020 జూన్ 21న యుగాంతం వచ్చేస్తోంది.. వచ్చేసింది.. వారు చెప్పిన ఆదివారం జూన్‌ 21 కూడా వెళ్లిపోయింది. ఇక మరోసారి ఈ యుగాంతం డేట్లను

భారీ ఉల్క.. రెండురోజుల్లో భూమికి అత్యంత సమీపంగా..
Follow us on

Asteroid four times taller than Qutub Minar: మయాన్ క్యాలెండర్‌ వాదన ప్రకారం 2020 జూన్ 21న యుగాంతం వచ్చేస్తోంది.. వచ్చేసింది.. వారు చెప్పిన ఆదివారం జూన్‌ 21 కూడా వెళ్లిపోయింది. ఇక మరోసారి ఈ యుగాంతం డేట్లను సవరించి చెప్తారేమో గానీ… ఎల్లుండి (జూన్‌ 24) మాత్రం పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టబోతోందంట. ఈ ఉల్క సాధారణంగా ఉండటం లేదంట.. కుతుబ్‌ మినార్‌ కన్నా మరింత ఎక్కువ పొడువులో ఉండనున్నదంట.

ఇంతకుముందు కూడా మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం 2012లో ప్రపంచం ముగియనుందంటూ పుకార్లు వచ్చిన విషయం విదితమే. ఇటీవల రాజస్థాన్‌లో ఒక ఉల్క పడిపోయి ప్రజల్లో భయాందోళనలను గురిచేసింది. ఈ ఉల్క 1,017 అడుగుల పొడవు, 310 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుందని అంచనా వేశారు. జూన్ 24 న మధ్యాహ్నం 12.15 గంటలకు భూమికి దగ్గరగా రానున్నదంట. దీనికి 2010NY65 అని పేరు కూడా పెట్టారు. నాసా సమాచారం ప్రకారం.. ఈ ఉల్క గంటకు 46,500 కిలోమీటర్ల వేగంతో కదులనున్నది. ఈ ఉల్క 2013 లో రష్యాలో పడిపోయిన ఉల్క కంటే 15 రెట్లు పెద్దదిగా భావిస్తున్నారు. జూన్ 6, 8 తేదీల్లో రెండు గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చాయి.