దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికుల వ్యక్తిగత రక్షణకు తెలంగాణ సర్కారు భరోసా ఇస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) అందజేయాలని అన్ని మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకెళితే.. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎనిమిది రకాల విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా విధులకు తగ్గట్టు వారికి రక్షణ కల్పించే ప్రత్యేక పీపీఈలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కీ) అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. అస్కీ సిఫారసుల మేరకు రక్షణ పరికరాలను అందజేయాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 60 వేలమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పలువురు కార్మికులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి రక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్ ప్రవేశపరీక్షలు రద్దు..!