బెంగళూరులో మహాబలుడు.. స్పెషాలిటీ ఏంటంటే..?

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2019 | 2:47 PM

ప్రపంచంలోనే అత్యంత బలవంతునిగా గుర్తింపు పొందిన హరియాణా వాసి మనోజ్ చోప్రా స్టంట్‌లను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎప్పటికప్పుడు కొత్తగా స్టంట్లు చేస్తూ.. అభిమానులు అబ్బురపరుస్తుంటాడు. తాజాగా బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం బలప్రదర్శన చేశాడు. ఒంటి కాలుతో కారును పైకెత్తి, చేతులతో దాన్ని మరోవైపు తిరగేశాడు. బేస్‌బాల్ బ్యాట్లను పటపటా విరగొట్టాడు. ఇనుప కడ్డీలను వేప పుల్లల్లా విరిచాడు. మందంగా ఉండే ఇనుప రేకును చేత్తో కొట్టి పగులగొట్టాడు. హాట్ వాటర్ బ్యాగ్‌ను గాలి […]

బెంగళూరులో మహాబలుడు.. స్పెషాలిటీ ఏంటంటే..?
Follow us on

ప్రపంచంలోనే అత్యంత బలవంతునిగా గుర్తింపు పొందిన హరియాణా వాసి మనోజ్ చోప్రా స్టంట్‌లను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎప్పటికప్పుడు కొత్తగా స్టంట్లు చేస్తూ.. అభిమానులు అబ్బురపరుస్తుంటాడు. తాజాగా బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం బలప్రదర్శన చేశాడు. ఒంటి కాలుతో కారును పైకెత్తి, చేతులతో దాన్ని మరోవైపు తిరగేశాడు. బేస్‌బాల్ బ్యాట్లను పటపటా విరగొట్టాడు. ఇనుప కడ్డీలను వేప పుల్లల్లా విరిచాడు. మందంగా ఉండే ఇనుప రేకును చేత్తో కొట్టి పగులగొట్టాడు. హాట్ వాటర్ బ్యాగ్‌ను గాలి బుడగలా ఊదేశాడు. వెయ్యికి పైగా పుటలున్న టెలిఫోన్ డైరెక్టరీని అవలీలగా చించేశాడు. పెనాన్ని దోసెలా చుట్టేశాడు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్న ఆయన పదేళ్ల తరువాత నగరానికి వచ్చాడు.