AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Elections Highlights : ఏపీలో గ్రామపోరులోనూ కూటమి పార్టీల ప్రభంజనం!

AP Panchayat Elections 1st Phase Voting Highlights in Telugu: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. సింబల్స్‌తో సంబంధం లేకుండా జరిగిన ఈ పోరులో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థులు.. భారీ సంఖ్యలో విజయం సాధించారు. పలు చోట్ల వైసీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందారు.

AP Panchayat Elections Highlights : ఏపీలో గ్రామపోరులోనూ కూటమి పార్టీల ప్రభంజనం!
Ap Panchayat Elections Live Updates
Balaraju Goud
|

Updated on: Nov 26, 2026 | 10:14 PM

Share

ఏపీలో గ్రామపోరుకు తొలిదశ పోలింగ్‌ ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. సింబల్స్‌తో సంబంధం లేకుండా జరిగిన ఈ పోరులో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థులు.. భారీ సంఖ్యలో విజయం సాధించారు. తొలి విడతలో మొత్తం 3వేల 949 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలకాగా.. 3వేల240 పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. వీటిలో మూడింట రెండొంతులు పంచాయితీలను కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేనలు గెలుచుకున్నాయి. వైసీపీ మద్దతుదారులు ఆశించినస్థాయిలో ప్రభావం చూపలేదు. భారీ సంఖ్యలో 70శాతానికి పైగా పంచాయతీలను దక్కించుకున్న కూటమి.. స్థానిక ఎన్నికల్లో విజయ పరంపరను కొనసాగించింది.

పట్టణ స్థానిక సంస్థల్లోనూ పోలింగ్‌ ప్రశాంతం!

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. తొలివిడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తి కాగా… మిగిలిన స్థానాల్లోనూ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా కందుకూరు స్థానంలో పోలింగ్‌శాతం నమోదు కాగా.. అత్యల్పంగా గూడూరు పట్టణంలో నమోదైంది. ఈ స్థానాలకు సంబంధించి ఫలితాలు ఈనెల 30న విడుదలవుతాయి.

లైవ్‌ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Nov 2026 07:19 PM (IST)

    విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం!

    స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినవారిని ఉపేక్షించం-ఏపీ డీజీపీ

    బ్యాలెట్ బాక్సులకు పటిష్ఠ భద్రత-ఏపీ డీజీపీ

    శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు-ఏపీ డీజీపీ

    విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం-ఏపీ డీజీపీ

    నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు-డీజీపీ

  • 26 Nov 2026 06:26 PM (IST)

    తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో జోరుగా పోలింగ్

    AP: తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో జోరుగా పోలింగ్

    పోలింగ్‌ ముగిసే సమయానికి 74.67 శాతం ఓటింగ్‌ నమోదు

    ఏలూరు జిల్లాలో అత్యధికంగా 84.83 శాతం పోలింగ్‌

    కడప జిల్లాలో అత్యల్పంగా 59.50 శాతం పోలింగ్ నమోదు

  • 26 Nov 2026 06:24 PM (IST)

    SECకి టీడీపీ నేతల ఫిర్యాదు

    విజయవాడ:

    ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు

    వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ ఫిర్యాదు

    ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

  • 26 Nov 2026 06:22 PM (IST)

    ముగిసిన పట్టణ స్థానిక సంస్థల పోలింగ్

    ఏపీలో ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల పోలింగ్

    సాయంత్రం 5 గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు

  • 26 Nov 2026 05:32 PM (IST)

    అనంతపురం రాచనపల్లిలో ఉద్రిక్తత

    అనంతపురం జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా రాచనపల్లిలో ఉద్రిక్తత

    కౌంటింగ్‌ కేంద్రం దగ్గర ఇరువర్గాల వాగ్వాదం

    కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ఇరువర్గాల యత్నం

    లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • 26 Nov 2026 05:26 PM (IST)

    సర్పంచ్ ఫలితాలు..

    చిత్తూరు: కుప్పం మండలం వసనాడులో టీడీపీ మద్దతు అభ్యర్థి సుబ్బలక్ష్మి విజయం

    విజయనగరం: తెర్లాం మండలం అప్ లంపేట పంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ బలపరిచిన వారాడ నీలవేణి 22 ఓట్లు మెజార్టీతో గెలుపు

  • 26 Nov 2026 05:23 PM (IST)

    గ్రామ పంచాయతీల్లోనూ టీడీపీ హవా

    నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో శెట్టిపాలెం పంచాయతీ సర్పంచ్‌గా పేట శివమ్మ (టీడీపీ) 24 ఓట్లతో విజయం

    చిత్తూరు: శాంతిపురం మండలం రేగడదిన్నేపల్లి సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు నాగమ్మ గెలుపు

    కృష్ణాజిల్లా: బంటుమిల్లిలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గుత్తుల సాల గౌరీ విజయం.

    పల్నాడు: కర్లకుంట సర్పంచ్‌‌గా టీడీపీ బలపరిచిన మధులత 927 ఓట్ల మెజార్టీతో గెలుపు

    పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెంలో టీడీపీ బలపరిచిన మల్లవరపు మరియమ్మ గెలుపు.

  • 26 Nov 2026 05:19 PM (IST)

    కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్

    రాష్ట్రంలోని నిర్వహించిన 1కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్

    రాజమహేంద్రవరం , కాకినాడ, శ్రీకాకుళం, మంగళగిరి నగరపాలక సంస్థల్లో ముగిసిన పోలింగ్

    సాయంత్రం 5 గంటలకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం

  • 26 Nov 2026 04:27 PM (IST)

    కందుకూరులో అత్యధికం.. గూడూరులో అత్యల్పం..!

    ఏపీ‌లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3:00 గంటల వరకు 55.07 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లకు గాను 13,75,799 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ప్రకాశం జిల్లా కందుకూరులో అత్యధికంగా 68.89 శాతం పోలింగ్ నమోదు కాగా, నెల్లూరు జిల్లా గూడూరులో అత్యల్పంగా 48.53 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 20 పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

  • 26 Nov 2026 04:13 PM (IST)

    స్వతంత్య్ర అభ్యర్థి విజయం

    కర్నూలు జిల్లా హాలహర్వి మండలం టి.సాకిబండ స్వతంత్య్ర అభ్యర్థి పద్మ 254 ఓట్లతో విజయం

  • 26 Nov 2026 04:12 PM (IST)

    బోణీ కొట్టిన తెలుగుదేశం పార్టీ

    పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

    కురుపాం మండలం ఊసకొండ పంచాయతీ సర్పంచ్‌గా ఆరిక చిన్నారావు (టీడీపీ) 12,512 ఓట్ల మెజార్టీతో గెలుపు.

    జరడ పంచాయతీలో సర్పంచ్‌గా ఆరిక సంపన్ని విజయం సాధించారు.

  • 26 Nov 2026 03:38 PM (IST)

    తొడగొట్టి సవాల్‌ విసిరిన సోము వీర్రాజు

    • రాజమహేంద్రవరం మల్లయ్యపేట 62వ బూత్‌ వద్ద ఉద్రిక్తత
    • వైసీపీ నేతలు ఎక్కువ మంది ఉన్నారని సోము వీర్రాజు అభ్యంతరం
    • బూత్‌ వద్ద వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
    • ఇక్కడే ఉంటా.. దమ్ముంటే రండి అంటూ తొడగొట్టి సవాల్ చేసిన సోము వీర్రాజు
  • 26 Nov 2026 03:10 PM (IST)

    ఇరు వర్గాల మధ్య ఘర్షణ

    • శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
    • రాళ్లు రువ్వడంతో పోలీసు సిబ్బందికి గాయాలు
    • పోలింగ్‌కు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ
    • అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • 26 Nov 2026 02:37 PM (IST)

    కొనసాగుతున్న కౌంటింగ్

    • ఏపీలో కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
    • తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
  • 26 Nov 2026 01:11 PM (IST)

    Panchayat Polling: ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్

    ఒంటి గంట వరకు క్యూలైన్‌లో ఉన్నవారికే ఓటేసే ఛాన్స్

    క్యూ లైన్‌లో భారీగా నిల్చున్న ఓటర్లు

    మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్

    సాయంత్రం వెలువడనున్న ఎన్నికల ఫలితాలు

  • 26 Nov 2026 12:54 PM (IST)

    Pawan Kalyan: ఓటు వేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా  గురువారం ఉదయం 11:30 గంటలకు మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో ఉన్న 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ ఓటర్లతో కలసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అలాగే దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

    Pawan Kalyan Exercised His Right To Vote

  • 26 Nov 2026 11:46 AM (IST)

    Polling percentage: ఏపీలో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇవే

    ఏపీ కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్

    11 గంటల వరకు వివిధ మండలాల్లో నమోదైన పోలింగ్‌ శాతం

    తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో 11 గంటల వరకు 71 శాతం పోలింగ్

    విజయనగరం జిల్లా వేపాడ మండలంలో 55.54 శాతం పోలింగ్

    తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 64.83 శాతం పోలింగ్ నమోదు

    రేణిగుంటలో 11 గంటల వరకు 42 శాతం పోలింగ్ నమోదు

    అనకాపల్లి చోడవరంలో 41 శాతం నమోదైన పోలింగ్

    సబ్బవరం మండలం రాయపుర అగ్రహారంలో 85 శాతం పోలింగ్

    సత్యసాయి జిల్లా: ముదిగుబ్బలో 50.49 శాతం పోలింగ్

    ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో 50.43 శాతం పోలింగ్

    ప.గో జిల్లా పెనుగొండలో 30 శాతం పోలింగ్ నమోదు

    శ్రీకాకుళం జిల్లా మందసలో 35.72 పోలింగ్

    పలాసలో 11గంటల వరకు 33.83 పోలింగ్

    కంచిలిలో 33.45 శాతం పోలింగ్ నమోదు

    కవిటిలో 31.18 శాతం పోలింగ్ నమోదు

    సోంపేటలో 28.87 పోలింగ్ పూర్తి

    ఇచ్ఛాపురంలో 11 గంటల వరకు 27.20 పోలింగ్

    వజ్రపుకొత్తూరులో 25.77 శాతం పోలైన ఓట్లు

  • 26 Nov 2026 11:10 AM (IST)

    Anantapur Polling: ప్రసన్నాయిపల్లి పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు మాయం

    అనంతపురం జిల్లా ప్రసన్నాయిపల్లి పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు మాయం కావడం కలకలం రేపుతోంది. బ్యాలెట్ పేపర్ల బండిల్ ఒకటి మిస్ అయినట్లు అర్ధరాత్రి గుర్తించారు పోలింగ్ సిబ్బంది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. మిస్సయిన బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్లను గుర్తించి, కౌంటింగ్‌లో అనుమతించబోమని అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

  • 26 Nov 2026 11:00 AM (IST)

    Panchayat Elections: ఏపీలో పంచాయతీ పోరు.. సొంతూళ్లకు పోటెత్తిన ఓటర్లు

    పంచాయతీ ఎన్నికల వేళ బిజీగా కుప్పం రైల్వే స్టేషన్

    బెంగళూరు నుంచి స్వగ్రామాలకు తిరిగివస్తున్న ప్రజానీకం

    కిక్కిరిసేలా కుప్పం చేరుకున్న లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్‌

    కుప్పం నియోజకవర్గంలోని 92 పంచాయతీల్లో 3 ఏకగ్రీవం

    పోలింగ్ జరుగుతున్న 89పంచాయతీలకు పోటెత్తిన ఓటర్లు

    34 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు

    పోలింగ్‌కి, కౌంటింగ్‌కి భారీ బందోబస్తు ఏర్పాటు

  • 26 Nov 2026 10:52 AM (IST)

    Nandyal Polling: జమ్ములదిన్నెలో నిలిచిన పోలింగ్ ప్రక్రియ

    నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలో ఉద్రిక్తత

    జమ్ములదిన్నెలో నిలిచిన పోలింగ్ ప్రక్రియ

    వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్‌ చేస్తున్నారని టీడీపీ మద్దతుదారులు ఆరోపణ

    కారంపోడి చల్లుకొని గొడవపడిన ఇరువర్గాలు

    పోలింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన ఎన్నికల అధికారులు

  • 26 Nov 2026 10:37 AM (IST)

    Polling percentage: ఏపీలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

    ఏపీలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    నరసరావుపేటలో 9 గంటల వరకు 13.71 శాతం పోలింగ్‌ పూర్తి

    మంగళగిరి-తాడేపల్లిలో 12.94 శాతం పూర్తైన పోలింగ్‌

    నరసరావుపేట మున్సిపాలిటీలో ఓటు వేసిన 14,769 మంది ఓటర్లు

    పొన్నూరు మున్సిపాలిటీలో 13.99 శాతం పోలింగ్‌ నమోదు

    శ్రీకాకుళంలో 9 గంటల వరకు 11.8 శాతం పోలింగ్‌ పూర్తి

  • 26 Nov 2026 10:33 AM (IST)

    Panchayat Polling: ఏపీలో పంచాయతీ పోరు.. ఓటు హక్క వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు

    ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్

    రాజమహేంద్రవరంలో ఓటు వేసిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

    మోరంపూడిలోని సిటీ స్పెషల్ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ

    తాడిగడప మున్సిపాలిటీలో ఓటు వేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

    ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

    వీఎల్ పురంలోని అక్షరశ్రీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి

  • 26 Nov 2026 09:06 AM (IST)

    Anakapalle Polling: పెళ్లి బట్టల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్

    అనకాపల్లి జిల్లా జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

    పెళ్లి పీటల నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు పెళ్లికొడుకు

    ఓటు హక్కు వినియోగించుకున్న నవ వరుడు కె గౌరినాయుడు

    రావికమతం మం చినపాచిలలో ఘటన

    ఈ తెల్లవారుజామున గౌరి నాయుడుకు వివాహం

    తలపై జీలకర్ర బెల్లం తోనే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసిన గౌరీ

  • 26 Nov 2026 08:24 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు

    ఉండవల్లిలోని MPU స్కూల్‌లో ఓటు చేసిన సీఎం చంద్రబాబు

    కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం

    భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి లోకేష్‌

    వీడియో ఇక్కడ చూడండి..

  • 26 Nov 2026 07:07 AM (IST)

    CM Chandrababu: ఏపీలో ఎన్నికలు.. సీఎం చంద్రబాబు ఓటు వేసేది ఇక్కడే

    ఏపీలో స్థానిక, పంచాయతీ ఎన్నికల పోరు

    ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం చంద్రబాబు

    మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటు వేయనున్న సీఎం

    ఉండవల్లిలోని MPU స్కూల్‌లో ఓటు వేయనున్న సీఎం

    అనంతరం తిరుమలకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • 26 Nov 2026 07:04 AM (IST)

    Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    3,189 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు

    ఏకగ్రీవం అయిన 760 పంచాయతీ స్థానాలు

    రాష్ట్రవ్యాప్తంగా 31, 614 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు

    మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న పోలింగ్

    రెండు గంటలు నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్

  • 26 Nov 2026 06:56 AM (IST)

    Panchayat Polling: ఏపీలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    26 జిల్లాల్లో 3,949 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్

    ఏకగ్రీవం అయిన 760 పంచాయతీ స్థానాలు

    3,189 సర్పంచ్ స్థానాలకు పోలింగ్

    39,832 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్

    14,731 స్థానాలు ఏకగ్రీవం

Published On - Nov 26,2026 6:51 AM

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..