వివేకా మ‌ృతిపై టీడీపీ నేతలపై ఆరోపణలు సరికాదు- ఆదినారాయణ రెడ్డి

అమరావతి: ఎక్కుడ ఏ చిన్న విషయం జరిగినా టీడీపీ నేతలపై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడం వైసీపీకి అలవాటైపోయిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి బాధాకరం. ఆయన మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలి. తప్పు చేసిన వారిని ఉరి తీయాలి. ఎక్కడో జరిగిన దాన్ని మాకు ఆపాదించడం ఎంత వరకు సమంజసం? గతంలో […]

వివేకా మ‌ృతిపై టీడీపీ నేతలపై ఆరోపణలు సరికాదు- ఆదినారాయణ రెడ్డి

Edited By:

Updated on: Mar 15, 2019 | 3:03 PM

అమరావతి: ఎక్కుడ ఏ చిన్న విషయం జరిగినా టీడీపీ నేతలపై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడం వైసీపీకి అలవాటైపోయిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి బాధాకరం. ఆయన మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలి. తప్పు చేసిన వారిని ఉరి తీయాలి. ఎక్కడో జరిగిన దాన్ని మాకు ఆపాదించడం ఎంత వరకు సమంజసం? గతంలో కోడికత్తి కేసులో నాపై ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. అభివృద్ధి విషయంలోనూ ఇలానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలను నిజాయతీగా ఎదుర్కోలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఆయన విమర్శించారు.

వివేకా ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఆవేదనలో ఉన్నారు. ఆ విషయంలోనే వారి మధ్య విభేదాలున్నాయి.  గతంలో విజయమ్మపైనా వివేకానందరెడ్డి పోటీ మంత్రి ఆదినారాయణ గుర్తు  చేశారు. మొదట గుండెపోటు అని ఆ తర్వాత మాట మార్చారు. వాళ్లలో వాళ్లకు అంతర్గతంగా ఏమైనా ఉంటే వారు చూసుకోవాలే తప్ప రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి సూచించారు.