ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి 5 వేలు నజరానా..!

| Edited By:

Jul 31, 2020 | 2:44 PM

కరోనా కాలంలో కూడా.. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి 5 వేలు నజరానా..!
Follow us on

కరోనా కాలంలో కూడా.. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడు పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు ప్రకటించారు.

కరోనా బాధితులను ఆదుకునే ప్లాస్మా థెరఫీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉండరాదని, ఆస్పత్రుల్లో భర్తీ వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని, ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేకుంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ అలాట్‌ అక్కడ నుంచే జరిగేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

హాస్పిటల్ హెల్ప్‌ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలని సూచించారు. బెడ్లు, వైద్యం, ఆహారం, పరిశుభ్రత పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సీఎం తెలిపారు.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!