ఫైనల్‌గా ఏపీ రాజధాని ఏది? తేలేది ఆరోజే!

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ? ఇదే ప్రశ్న ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. యావత్ తెలుగు ప్రజల్లో నానుతోంది. తాజాగా.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో.. అమరావతి రైతులు ఏకంగా 20 రోజుల నుంచి రోడ్డుపై నిరసనలు చేస్తున్నారు. ఖచ్చితంగా అమరావతినే రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. మరోప్రక్క గణతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు విశాఖలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి జరుగుతున్న గణతంత్ర వేడుకలు, దానికి తోడు కార్యనిర్వాహక రాజధానిగా […]

ఫైనల్‌గా ఏపీ రాజధాని ఏది? తేలేది ఆరోజే!

Edited By:

Updated on: Jan 11, 2020 | 9:50 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ? ఇదే ప్రశ్న ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. యావత్ తెలుగు ప్రజల్లో నానుతోంది. తాజాగా.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో.. అమరావతి రైతులు ఏకంగా 20 రోజుల నుంచి రోడ్డుపై నిరసనలు చేస్తున్నారు. ఖచ్చితంగా అమరావతినే రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. మరోప్రక్క గణతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు విశాఖలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి జరుగుతున్న గణతంత్ర వేడుకలు, దానికి తోడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అనధికారికంగా ప్రకటించిన తర్వాత జరగనున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అయితే.. ఈ నెల 20వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోందట. రాజధాని అంశంపై కూడా అదే రోజు సభలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికపై చర్చిస్తున్న హైపవర్‌ కమిటీ ఆలోపే నివేదిక ఇస్తుంది. ఇక అప్పుడే కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని ప్రకటిస్తారని సమాచారం.