జ‌గ‌న్ మార్క్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై వారి వెన్నుల్లో వ‌ణుకుపుట్టించ‌నున్న సీఎం…

|

May 09, 2020 | 5:25 PM

ఏపీలో అక్ర‌మ ఇసుక‌, మ‌ద్యం ర‌వాణాను పూర్తిగా అరిక‌ట్టేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కు శ్రీకారం చుట్టింది. బోర్డ‌ర్స్ నుంచి మద్యం, ఇసుక‌ అక్రమంగా రవాణా కాకుండా.. నాటు సారా నిరోధించడానికి బలోపేతమైన ఈ స్వతంత్ర వ్యవస్థ రానుంది. ఎక్సైజ్‌శాఖామంత్రి, సీఎస్, డీజీపీల సహా ముఖ్య‌ అధికారులు హాజరైన మీటింగులో సీఎం ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివరించారు. ఆ వ్యవస్థ ఎలా ఉండాల‌న్నదానిపై అధికారులకు […]

జ‌గ‌న్ మార్క్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై వారి వెన్నుల్లో వ‌ణుకుపుట్టించ‌నున్న సీఎం...
Follow us on

ఏపీలో అక్ర‌మ ఇసుక‌, మ‌ద్యం ర‌వాణాను పూర్తిగా అరిక‌ట్టేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కు శ్రీకారం చుట్టింది. బోర్డ‌ర్స్ నుంచి మద్యం, ఇసుక‌ అక్రమంగా రవాణా కాకుండా.. నాటు సారా నిరోధించడానికి బలోపేతమైన ఈ స్వతంత్ర వ్యవస్థ రానుంది. ఎక్సైజ్‌శాఖామంత్రి, సీఎస్, డీజీపీల సహా ముఖ్య‌ అధికారులు హాజరైన మీటింగులో సీఎం ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివరించారు. ఆ వ్యవస్థ ఎలా ఉండాల‌న్నదానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, ఇసుక అక్రమ రవాణా పూర్తిగా ఆగిపోవాలని స్ప‌ష్టం చేశారు.

ఏసీబీ, విజిలెన్స్‌ మరియు ఎన్‌ఫోర్స్‌ మెంట్, ఇంటెలిజెన్స్‌ ఎలా వ‌ర్క్ చేస్తాయో… అదే తీరులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) ప‌నితీరు ఉండాల‌న్నారు. ముఖ్య‌మంత్రి ఆదేశాలతో అధికారులు స్వతంత్ర వ్యవస్థకు ఫైన‌ల్ వెర్ష‌న్ ప్రిపేర్ చేశారు. గతంలో ఎక్సైజ్‌ కమిషనర్ అండ‌ర్ లో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు ఉండేది. తాజాగా ఎక్సైజ్‌ కమిషనర్‌ కింద ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు ప్లేసులో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) పోస్టు వస్తుంది. దీన్ని డీజీపీ ప‌ర్య‌వేక్షిస్తూ ఉంటారు. ఎక్సైజ్‌ విభాగంలో ఉన్న సిబ్బందిలో… కొంద‌రు ఎక్సైజ్‌ కమిషనర్ కేట‌గిరీ కిందకు వస్తారు. ప్రభుత్వమే లిక్క‌ర్ షాపుల‌ను నిర్వహిస్తున్నందున స్టాకు, విక్రయాలు, లైసెన్స్‌లు, ప్రొడక్షన్‌ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్‌ కమిషనర్ ప‌ర్య‌వేక్షిస్తారు.

ఎక్సైజ్‌ విభాగంలో మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాలను..ఇసుక అక్ర‌మ రవాణాను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) కింద జిల్లాల్లో ఏఎస్పీలు కూడా వ‌ర్క్ చేస్తారు. ఒక్కో ఏఎస్పీ కింద కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు కోఆర్డినేట్ చేసుకుంటారు. అక్ర‌మ ర‌వాణాకు ఎక్కువ ఆస్కారం ఉన్న‌ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) కోసం ఐపీఎస్‌ స్థాయి అధికారులు ఉంటారు. వీరంతా కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) రిపోర్టు చేస్తారు. ఈ సిబ్బందికి మెరుగైన సదుపాయాలు, వెహిక‌ల్స్ ఇచ్చి గట్టిగా పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు.