పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నదికి పన్నెండేళ్ల పండుగ.. కర్నూలు జిల్లాలో అధికారికంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి

|

Nov 20, 2020 | 2:41 PM

పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాలో ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. జల్లు స్నానం చేసిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయుష్ హోమం లో ముఖ్యమంత్రి పూజలు చేశారు. ఈ హోమం కార్యక్రమంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన వేద పండితులు పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను […]

పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నదికి పన్నెండేళ్ల పండుగ.. కర్నూలు జిల్లాలో అధికారికంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి
Follow us on

పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాలో ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. జల్లు స్నానం చేసిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయుష్ హోమం లో ముఖ్యమంత్రి పూజలు చేశారు. ఈ హోమం కార్యక్రమంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన వేద పండితులు పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.