ఏపీ సీఎం జగన్ స్పీచ్: కీ పాయింట్స్..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలను అందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన.. భారీ బహిరంగ సభలో జగన్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే.. భారీ ఎత్తున యువత కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా.. జిల్లాల వారీగా.. అర్హులకు అపాయింట్‌ మెంట్ లెటర్స్‌ ఇవ్వనున్నారు ఏపీ ఇన్‌ఛార్జ్ మంత్రులు. జగన్ స్పీచ్ హైలెట్స్: 1. ఉద్యోగాల చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్ అని అన్నారు. 2. నాలుగు […]

ఏపీ సీఎం జగన్ స్పీచ్: కీ పాయింట్స్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 30, 2019 | 3:19 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలను అందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన.. భారీ బహిరంగ సభలో జగన్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే.. భారీ ఎత్తున యువత కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా.. జిల్లాల వారీగా.. అర్హులకు అపాయింట్‌ మెంట్ లెటర్స్‌ ఇవ్వనున్నారు ఏపీ ఇన్‌ఛార్జ్ మంత్రులు.

జగన్ స్పీచ్ హైలెట్స్:

1. ఉద్యోగాల చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్ అని అన్నారు. 2. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు. 3. దాదాపు లక్షన్నర మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు సీఎం. 4. నిజాయితీగా, లంచాలు లేని, పారదర్శక పాలన అందజేయాలని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. 5. వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలని.. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలి 6. అవినీతి లేని పాలన కోసం ప్రజలందరూ చూస్తున్నారని.. ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగుల భుజాలపై పెడుతున్నా 7. నా నమ్మకాన్ని ఎవరూ వమ్ము చెయొద్దు 8. ఇది ఒక ఉద్యోగంలా కాకుండా.. ఉద్యమంలా పని చేయండి. 9. 72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరించడమే మీ లక్ష్యం 10. మొత్తం 19 రకాల ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక 11. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు 12. ప్రతీ గ్రామ వాలంటీర్‌కు ఒక స్మార్ట్ ఫోన్ 13. 34డిపార్టు మెంట్లకు సంబంధించి పనులు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతాయి 14. గ్రామ సచివాలయాల్లో డిసెంబర్ తొలి వారం కల్లా కంప్యూటర్లు, సహా ఇతరత్రా పరికరాలు, ఫర్నీచర్ పూర్తిగా అందుబాటులోకి తెస్తాం 15. జనవరి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ పథకాలన్నీ గ్రామ సచివాలయం పరిధిలోకి వస్తాయి 16. ఫిర్యాదుల కోసం సీఎం పేషిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం 17. ఉద్యోగాలు రానివారెవరూ నిరాశచెందవద్దు 18. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతాo 19. ఉద్యోగాలు సాధించిన 1లక్ష 35 వేల మంది అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు 20. జనవరి 1 నుంచి గ్రామాల్లో 500ల సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం జగన్.