వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు.. దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు..!

|

Nov 30, 2020 | 12:05 PM

నిన్న మొన్నటి వరకు నివర్ తుపాన్‌తో వణికిపోయిన దక్షిణ భారతాని మరో తుపాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. ఐఎండీ సూచనల ప్రకారం రాగల 24గంటల్లో వాయుగుండం బలపడనుంది.

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు.. దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో  భారీ వర్షాలు..!
Follow us on

నిన్న మొన్నటి వరకు నివర్ తుపాన్‌తో వణికిపోయిన దక్షిణ భారతాని మరో తుపాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. ఐఎండీ సూచనల ప్రకారం రాగల 24గంటల్లో వాయుగుండం బలపడనుంది. ఇది శ్రీలంకకు 750 కిలో మీటర్ల దూరంలోని కొమరిన్‌కు 1,150 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. వాయుగుండం పశ్చిమ దిశగా పయనిస్తూ బుధవారం సాయంత్రం శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉందని… దీని ప్రభావంతో బుధవారం, గురువారం దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇటు, దక్షిణకోస్తాతో పాటు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. రేపు రాత్రి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని…వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించారు. ప్రజలు , రైతులు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు సూచించారు. కాగా, రాగల ఐదు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.