నెల్లూరులో రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అటవీ శాఖ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. నెల్లూరుజిల్లాలో రూ.3 కోట్ల విలువగల ఎర్రచందనం పట్టుబడింది.

నెల్లూరులో రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Updated on: Oct 29, 2020 | 2:11 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అటవీ శాఖ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. నెల్లూరుజిల్లాలో రూ.3 కోట్ల విలువగల ఎర్రచందనం పట్టుబడింది. ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని నెల్లూరు పాలెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా లారీలో ఎర్రచందనం దుంగల‌ను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్నారు. దీంతో పక్కాగా నిఘా పెట్టిన అట‌వీ అధికారులు లారీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 194 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశామ‌ని పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అయితే నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామ‌ని తెలిపారు. పారిపోయిన నిందుతుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us