బుల్లితెర‌పై రికార్డ్స్ బ్రేక్ చేసిన బ‌న్నీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’

| Edited By:

Aug 27, 2020 | 4:20 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్మ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'అల వైకుంఠ‌పుర‌ములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. బ‌న్నీ డ్యాన్స్‌లు, త్రివిక్ర‌మ్ స్టైలిష్ మేకింగ్, త‌మ‌న్ సంగీతం ఇలా అన్ని విభాగాల్లోనూ..

బుల్లితెర‌పై రికార్డ్స్ బ్రేక్ చేసిన బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్మ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. బ‌న్నీ డ్యాన్స్‌లు, త్రివిక్ర‌మ్ స్టైలిష్ మేకింగ్, త‌మ‌న్ సంగీతం ఇలా అన్ని విభాగాల్లోనూ ఆక‌ట్టుకుందీ సినిమా. అలాగే ఇప్ప‌టికే ఈ సినిమా సాంగ్స్ కూడా ఎన్నో రికార్డుల‌ను కైవ‌సం చేసున్నాయి. తాజాగా మ‌రో ఆల్ టైం రికార్డ్‌ను సొంతం చేసుకుంది. వెండితెర‌పై సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాకు టీవీలో కూడా అదే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సినిమాకు రాని టీఆర్పీని ఇది ద‌క్కించ‌కుంది. ఈ సినిమా మొద‌టిసారి టీవీలో ప్ర‌సార‌మై ఏకంగా 29.4 రేటింగ్‌ను సాధించింది. ఇదే ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ అత్య‌ధికం. త‌ర్వాత స్థానాల్లో స‌రిలేరు నీకెవ్వ‌రూ (23.4), బాహుబలి-2 (22.7), బాహుబ‌లి (21.8) ఉన్నాయి. ఈ మేర‌కు గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఇంత‌టి అద్భుత‌మైన మీ ప్రతిస్పంద‌న, ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అని తెలిపింది ట్వీట్‌లో పేర్కొంది.

Read More:

ఆదిపురుష్ ప్రాజెక్ట్: ఇంటివ‌ద్ద‌నే విలువిద్య నేర్చుకుంటోన్న ప్ర‌భాస్‌?

కోమాలోనే ప్ర‌ణ‌బ్.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా తలెత్తాయిః ఆస్ప‌త్రి వైద్యులు

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు