జియో బాటలో ఎయిర్‌టెల్.. వినియోగదారులకు షాక్..!

| Edited By:

Dec 01, 2019 | 8:34 PM

ఇప్పటికే.. జియో.. ఐడియా-వొడాఫోన్‌ సంస్థలు.. ధరలు పెంచి వినియోగదారులకు షాక్.. ఇస్తుంటే.. ఇప్పుడు ఎయిర్‌ టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా.. కాల్, డేటా ఛార్జీలను భారీగా పెంచేసింది ఎయిర్‌టెల్. ఈ పెరగనున్న ఛార్జీలు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని.. సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. పాత ధరలతో పోలిస్తే.. ఇప్పటి ధరలు సుమారు 42 శాతం మేర పెరిగాయి. వివిధ టారిఫ్ ప్లాన్‌లలో రోజుకు 50 పైసల నుంచి రూ.2.85 వరకు […]

జియో బాటలో ఎయిర్‌టెల్.. వినియోగదారులకు షాక్..!
Follow us on

ఇప్పటికే.. జియో.. ఐడియా-వొడాఫోన్‌ సంస్థలు.. ధరలు పెంచి వినియోగదారులకు షాక్.. ఇస్తుంటే.. ఇప్పుడు ఎయిర్‌ టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా.. కాల్, డేటా ఛార్జీలను భారీగా పెంచేసింది ఎయిర్‌టెల్. ఈ పెరగనున్న ఛార్జీలు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని.. సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. పాత ధరలతో పోలిస్తే.. ఇప్పటి ధరలు సుమారు 42 శాతం మేర పెరిగాయి.

వివిధ టారిఫ్ ప్లాన్‌లలో రోజుకు 50 పైసల నుంచి రూ.2.85 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్టు కాల్, డేటా లాభాలు కూడా ఉంటాయని ఎయిర్ టెల్ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా.. ఎయిర్ టెల్ థాంక్స్ ఫ్లాట్‌ఫాం వేదికగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందిస్తామని తెలిపింది. ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో దాదాపు.. 10 వేల సినిమాలు, షోలు, 400 ఛానళ్లు, వింక్ మ్యూజిక్ లాంటివి అందించనుంది. అయితే.. ఈ పెరిగిన ఛార్జీలతో.. వినియోగదారులు ఇబ్బందిపడే అవకాశముంది. దీంతో.. ఎయిర్‌టెల్‌కు కస్టమర్లు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు.