పౌరసత్వ చట్టం పై ఆగ్రా, మధురలో విద్యార్థుల నిరసన!

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై దేశవ్యాప్త నిరసన ఊపందుకుంది. అలీగర్ లో ఇటీవల విద్యార్థులపై జరిగిన హింసాకాండ, దాడుల తరువాత నిరసనలు ఇప్పుడు బ్రజ్ ప్రాంతానికి వ్యాపించాయి. మధురలో ఆగ్రాకు చెందిన సర్వదలీ ముస్లిం యాక్షన్ కమిటీ సిఎఎ వ్యతిరేక నిరసనను నిర్వహించింది. నిషేధిత ఆదేశాలు ఉన్నప్పటికీ సిఎఎకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. సెక్షన్ 144, 151 ఉల్లంఘించినందుకు మధుర పోలీసులు ఇప్పటివరకు 38 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అరెస్టయిన […]

పౌరసత్వ చట్టం పై ఆగ్రా, మధురలో విద్యార్థుల నిరసన!

Edited By:

Updated on: Dec 18, 2019 | 9:39 PM

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై దేశవ్యాప్త నిరసన ఊపందుకుంది. అలీగర్ లో ఇటీవల విద్యార్థులపై జరిగిన హింసాకాండ, దాడుల తరువాత నిరసనలు ఇప్పుడు బ్రజ్ ప్రాంతానికి వ్యాపించాయి. మధురలో ఆగ్రాకు చెందిన సర్వదలీ ముస్లిం యాక్షన్ కమిటీ సిఎఎ వ్యతిరేక నిరసనను నిర్వహించింది. నిషేధిత ఆదేశాలు ఉన్నప్పటికీ సిఎఎకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. సెక్షన్ 144, 151 ఉల్లంఘించినందుకు మధుర పోలీసులు ఇప్పటివరకు 38 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మధుర సర్వదలీ ముస్లిం యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఉన్నారు. మిగతా ముప్పై ఆరు మంది వ్యక్తిగత బాండ్లపై విడుదలయ్యారు.

ఆగ్రాలో బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయలో సిఎఎకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడానికి ప్రయత్నించిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదేమైనా, విశ్వవిద్యాలయంలో ప్రస్తుత పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ప్రదర్శన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ ఎన్.జి.రవి కుమార్, ఎస్.ఎస్.పి బబ్లు కుమార్ ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ నిరసనలు నగరంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించకుండా చూసుకోవాలని సూచించారు.