ఎయిర్‌స్ట్రైక్‌.. 15 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం..

ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యానికి, తాలిబన్లకు మధ్య మళ్లీ వార్‌ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టి.. రోజు ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో..

ఎయిర్‌స్ట్రైక్‌.. 15 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం..
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 10:42 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యానికి, తాలిబన్లకు మధ్య మళ్లీ వార్‌ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టి.. రోజు ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్‌ సైన్యం కూడా తాలిబన్లపై ఎదురు దాడి చేస్తోంది. తాజాగా బుధవారం నాడు ఆఫ్ఘన్ బలగాలు తాలిబన్లపై ఎయిర్‌ స్ట్రైక్‌ జరిపాయి. ఈ ఘటనలో 15 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కాందహార్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి మైవాండ్‌ జిల్లాలోని స్ర బాగల్‌ ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్టులపై తాలిబన్లు దాడికి పాల్పడ్డారని.. ఈ ఘటనలో ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు మరణించగా.. నలుగురు గాయపడ్డారని కాందహార్‌ పోలీస్ అధికార ప్రతినిధి జమల్ నాసిర్ బరక్జాయ్‌ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఎక్కడో ఓ చోట సైన్యానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.