Adipurush Shooting: సెట్స్‌పైకి వెళుతోన్న ప్రభాస్‌ కొత్త సినిమా.. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్‌లో..

|

Jan 07, 2021 | 11:18 AM

Adipurush Movie Update: బాహుబలితో నేషనల్‌ హీరోగా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తొలిసారి నటిస్తోన్న స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమా 'ఆదిపురుష్‌'.

Adipurush Shooting: సెట్స్‌పైకి వెళుతోన్న ప్రభాస్‌ కొత్త సినిమా.. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్‌లో..
Follow us on

Adipurush Movie Update: బాహుబలితో నేషనల్‌ హీరోగా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తొలిసారి నటిస్తోన్న స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమా ‘ఆదిపురుష్‌’. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ఈనెల 19 నుంచి ఆదిపురుష్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ హంగులతో ఓ పౌరాణిక సెట్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. తొలి షెడ్యుల్‌లో ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని షూట్‌ చేయనున్నారని తెలుస్తోంది. త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌.. లంకేష్‌ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయనున్నారు.

Also Read: షష్టిపూర్తి జరుపుకున్న మహాద్భుత చిత్రరాజం సీతారామకళ్యాణం, తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన సినిమా .