ఆదర్శ జైలు..సిరుల సేద్యం చేస్తున్న ఖైదీలు..!

“జైలు అంటే..నేరం చేసిన ఖైదీలకు వేసే శిక్షలకు నిలయాలు. కానీ, ఆదిలాబాద్‌ జిల్లా జైలు మాత్రం ఆదర్శంగా నిలుస్తోంది. ఖైదీల సత్‌ప్రవర్తనకు కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపిస్తోంది. హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి జైలుకు వచ్చే కరుడుగట్టిన నేరస్తులను సైతం కర్షకులుగా తీర్చిదిద్దుతోంది. జైలు సూపరింటెండెంట్‌ శోభన్‌ బాబు నిర్ణయంతో ఖైదీల్లో మార్పు కనిపిస్తోంది. కారాగారం కాస్త..మేరుగైన వ్యవసాయక్షేత్రంగా మారింది. ఆ జైలు ఆవరణలో ఎటు చూసినా పూల తోటలు, పండ్లు, కూరగాయ తోటలే కనిపిస్తున్నాయి. పచ్చికబయళ్లతో ఆహ్లాదవాతావరణంలో […]

ఆదర్శ జైలు..సిరుల సేద్యం చేస్తున్న ఖైదీలు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 3:39 PM

“జైలు అంటే..నేరం చేసిన ఖైదీలకు వేసే శిక్షలకు నిలయాలు. కానీ, ఆదిలాబాద్‌ జిల్లా జైలు మాత్రం ఆదర్శంగా నిలుస్తోంది. ఖైదీల సత్‌ప్రవర్తనకు కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపిస్తోంది. హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి జైలుకు వచ్చే కరుడుగట్టిన నేరస్తులను సైతం కర్షకులుగా తీర్చిదిద్దుతోంది. జైలు సూపరింటెండెంట్‌ శోభన్‌ బాబు నిర్ణయంతో ఖైదీల్లో మార్పు కనిపిస్తోంది. కారాగారం కాస్త..మేరుగైన వ్యవసాయక్షేత్రంగా మారింది. ఆ జైలు ఆవరణలో ఎటు చూసినా పూల తోటలు, పండ్లు, కూరగాయ తోటలే కనిపిస్తున్నాయి. పచ్చికబయళ్లతో ఆహ్లాదవాతావరణంలో ఉద్యన వనాలతో ఖైదీల్లో ప్రశాంతతను నింపుతోంది.
జైలులో 18 ఎకరాల విస్తీర్ణంలో ఖైదీలతో సాగు చేయిస్తున్నారు అధికారులు. రెండెకరాల విస్తీర్ణంలో టేకు వృక్షాలు, మరో రెండున్నర ఎకరాల్లో కంది పంట, ఎకరం విస్తీర్ణంలో బంతి, చేమంతి, లిల్లీ వంటి పూలతోటలు వేశారు. మరో అర ఎకరంలో డెకరేషన్లకు ఉపయోగించే గడ్డిసాగు, అర ఎకరంలో అధిక లాభాలను ఆర్జించే టమాట, ఇతర కూరగాయలు పండిస్తున్నారు. మరో అర ఎకరంలో మిర్చిని సాగుచేస్తున్నారు. అంతర్‌ పంటలుగా మెంతి, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, మామిడి, యాపిల్‌, బేర్‌ యాపిల్‌, జామా, దానిమ్మ, సీతాఫలం వంటివి సాగుచేస్తున్నారు. జైలు అధికారుల పర్యవేక్షణలో ఖైదీలే కర్షకులుగా కొనసాగుతున్న సాగు విధానం చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ పాడిపరిశ్రమ కూడా కొనసాగుతోంది. పాడి పరిశ్రమ శాఖ చైర్మన్ లోక భూమారెడ్డి సహకారంతో జైలులో రెండు గేదెలను కూడా సాకుతున్నారు.
ఆదిలాబాద్‌ జిల్లా జైలులో దీర్ఘకాలం ఖైదీలుగా 34 మంది ఉంటే, స్వల్పకాలం ఖైదీలుగా 102 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ, జైలు సూపరింటెండెంట్‌ ఆలోచనతో ఖైదీల ప్రవర్తలో మార్పు తెచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జైలు అంటే నరకకూపం అనే మాటలు కేవలం అపోహలు మాత్రమేనని జైలు సూపరింటెండెంట్‌ శోభన్‌బాబు కొట్టిపారేశారు. తెలంగాణ జైళ్లలో ఖైదీలను కష్టించే విధానంతో శ్రమించి సంపాదించుకునేలా తీర్చిదిద్దుతూ, వారిని మంచి మనుషులుగా మార్చాలన్నదే ప్రభుత్వం సంకల్పం అని చెప్పారు. దీంతో రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లా జైలు ఆదర్శంగా నిలుస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో