రాజకీయాలపై ఆసక్తి లేదుః సోనూసూద్

కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు బాలీవుడ్ హీరో సోనూసూద్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సుమారు 30,000 పైచిలుక వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. తాను రాజకీయాల్లో చేరలనుకోవడం లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా వలస కార్మికులను సొంతూళ్ళకు చేర్చడంలోనే ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు చాలా ఇష్టమని […]

రాజకీయాలపై ఆసక్తి లేదుః సోనూసూద్

Updated on: Jun 15, 2020 | 11:04 PM

కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు బాలీవుడ్ హీరో సోనూసూద్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సుమారు 30,000 పైచిలుక వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. తాను రాజకీయాల్లో చేరలనుకోవడం లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా వలస కార్మికులను సొంతూళ్ళకు చేర్చడంలోనే ఉందని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు చాలా ఇష్టమని సోనూసూద్ మనసులోని మాటను బయటపెట్టాడు. గతంలోనే తనకు పంజాబ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పలు పార్టీల నుండి ఆఫర్లు వచ్చినట్లు ఆయన వివరించాడు. కానీ తనకు మాత్రం యాక్టింగ్ అంటేనే ఇష్టమని అన్నాడు. తాను రాజకీయాల గురించి గతంలోనూ, ఇప్పుడూ కూడా ఆలోచించట్లేదని సోనూసూద్ స్పష్టం చేశాడు. కాగా, ప్రస్తుతం తాను చేస్తున్న ఈ సేవ ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపాడు.

Follow Us