జగిత్యాల జిల్లాలో యాసిడ్ దాడి కలకలం.. మహిళపై గుర్తు తెలియని దుండగుల దాడి.. బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన..

|

Dec 23, 2020 | 10:22 PM

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై యాసిడ్‌ దాడి కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లాలో యాసిడ్ దాడి కలకలం.. మహిళపై గుర్తు తెలియని దుండగుల దాడి.. బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన..
Follow us on

Acid attack on women: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై యాసిడ్‌ దాడి కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు దగి బస్టాండ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌ పోసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తిమ్మాపూర్‌ తండాకు చెందిన మహిళ, అదే మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త రవి ఆరు నెలల క్రితం చనిపోయాడు. కాగా, ఇటీవల ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వాతి తన పుట్టింటికి తిమ్మాపూర్‌కు వెళ్లింది. ఇదే క్రమంలోనే ఇవాళ పనిమీద మెట్‌పల్లికి వెళ్లిన స్వాతి సాయంత్రానికి తండా బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుండగా.. హెల్మెట్‌ ధరించి ఉన్న గుర్తుతెలియని దుండగుడు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసి పారిపోయాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. మహిళ ముఖం కుడి భాగం కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలని మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ దాడికి పాల్పడ్డ దుండగుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.