కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర ఆగివున్న లారీని మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.