యజమానులు, శునకాల మధ్య రిలేషన్‌పై బయటపడ్డ ఆసక్తికర విషయాలు

కుక్కలను అత్యంత ప్రేమించే పెంపుడు జంతువులు అని చెప్పవచ్చు. అవి పెంపుడు జంతువులు కానప్పటికీ, కుక్కలు కొన్నిసార్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అవి నిజాయితీగా,ఆహ్లాదకరమైన మరియు సహాయకారిగా ఉంటాయి. మనిషి తన ఇంట్లో పెంచుకునే కుక్క తన ఇంటి సభ్యులుగా మారిన దాఖలాలు చూశాం. అయితే యజమానికి, కుక్కకు కొన్నేళ్లకు విడదీయరాని బంధం ఏర్పడుతోందని ఓ పరిశోధనలో వెళ్లడైంది. కుక్కల వయస్సు పెరిగే కొలది వాటి ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయని.. యజమానికి అనుకూలంగా మారతాయని మిచిగాన్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:52 pm, Mon, 25 February 19
యజమానులు, శునకాల మధ్య రిలేషన్‌పై బయటపడ్డ ఆసక్తికర విషయాలు

కుక్కలను అత్యంత ప్రేమించే పెంపుడు జంతువులు అని చెప్పవచ్చు. అవి పెంపుడు జంతువులు కానప్పటికీ, కుక్కలు కొన్నిసార్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అవి నిజాయితీగా,ఆహ్లాదకరమైన మరియు సహాయకారిగా ఉంటాయి. మనిషి తన ఇంట్లో పెంచుకునే కుక్క తన ఇంటి సభ్యులుగా మారిన దాఖలాలు చూశాం. అయితే యజమానికి, కుక్కకు కొన్నేళ్లకు విడదీయరాని బంధం ఏర్పడుతోందని ఓ పరిశోధనలో వెళ్లడైంది.

కుక్కల వయస్సు పెరిగే కొలది వాటి ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయని.. యజమానికి అనుకూలంగా మారతాయని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ఫ్రోఫెసర్ విలియం చోపిక్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. దీనికోసం 1600 కుక్కలపై ప్రత్యేకంగ పరిశోధన చేపట్టారు. అవి యజమాని స్వభావాన్ని తెలుసుకుని కాలక్రమేణా దాని స్వభావాన్ని మార్చుకుంటుందని వెల్లడైంది. అంతేకాదు పలువురు యజమానులతో చర్చించినప్పుడు కూడా ఈ విషయాలు వెల్లడైనట్లు ఫ్రోఫెసర్ విలియం చోపిక్ తెలిపారు.

మనుషుల జీవితంలో కుక్కలు కూడా మంచి స్నేహితులుగా మారతాయని.. మనిషి వయస్సు పెరుగుతున్నప్పుడు అతని జీవితంలో చోటుచేసుకునే మార్పులకు అనుకూలంగా పెంపుడు కుక్కలు ప్రవర్తిస్తాయని తేలింది. మిచిగాన్ యూనివర్సిటీ బృందం మూడు ప్రధాన నగరాల్లో దాదాపు 1500 కంటే ఎక్కువ మంది శునకాలను పెంచుకునే యజమానులను కలిసి సర్వేచేపట్టారు. ఇందులో 50వేరు వేరు జాతికి సంబంధించిన శునకాలు ఉన్నాయి. అంతేకాదు ప్రత్యేకంగా ఆడ, మగ కుక్కలపై పరిశోధనలు చేశారు. చిన్న వయస్సులో ఉన్న కుక్కలకు.. పెద్ద వయస్సు ఉన్న కుక్కలకు మధ్య తేడాను కూడా గుర్తించారు. అయితే చిన్న వయస్సు నుంచి దాదాపు పదిహేను సంవత్సరాలు ఉన్న కుక్కలపై ఈ సర్వే చేపట్టారు. అవి యజమానులతో ఏవిధంగా ప్రవర్తిస్తున్నాయన్న దానిపై పరిశోధనలు చేపట్టారు.

అయితే ఎక్కువ వయస్సు గల కుక్కలు యజమానికి అనుకూలంగా ప్రవర్తించడానికి సమయం పడుతుందని.. అదే తక్కువ వయస్సు ఉన్న కుక్కలు యజమాని దినచర్యను త్వరగా అర్ధం చేసుకుంటాయని వెల్లడైంది. అంతేకాదు చిన్న వయస్సు కుక్కలు యజమాని మనస్తత్వాన్ని త్వరగా అర్ధం చేసుకుని యజమానికి అనుకూలంగా ప్రవర్తిస్తాయని.. అంతేకాకుండా యజమాని చేసే పనిని ముందే పసిగడుతాయని తేలింది. అయితే ఒంటిరా జీవించే మనుషులు కుక్కలను తమ స్నేహితులుగా భావిస్తారని.. వాటితో ఓ స్నేహితుడితో మెదిలినట్లు ప్రవర్తిస్తారని తేలింది. అయితే కుక్కలు కూడా యజమానితో అలానే ప్రవర్తిస్తాయని తేలింది. అంతేకాదు యజమాని కుక్క మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుందని పరిశోధనలో వెల్లడించారు.

ప్రోఫెసర్ విలియం చోపిక్ తన పరిశోధన ప్రకారం ఒక విషయాన్ని తేల్చిచెప్పారు. మనిషి తన వయస్సు పెరిగేకొద్ది వ్యక్తిత్వంలో ఏలా మార్పులు వస్తాయో.. అలానే కుక్కలో కూడా మార్పులు వస్తాయని తెలిపారు.
అంతేకాదు యజమాని ప్రవర్తనలో మార్పు వస్తే కుక్క కూడా యజమానికి అనుకూలంగా ప్రవర్తిస్తుందని తేలింది.