సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..

అచ్చం సినిమాలో చూపించిన మాదిరిగానే జువైనల్ హోమ్ నుండి పారిపోయారు 8 మంది నేరస్తులు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‎లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజులరామారం కైసర్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న యూనియన్ హోమ్ నుండి మంగళవారం ఉదయం 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. ఘటనపై సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..
Juvenile Home
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 11:23 AM

అచ్చం సినిమాలో చూపించిన మాదిరిగానే జువైనల్ హోమ్ నుండి పారిపోయారు 8 మంది నేరస్తులు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‎లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజులరామారం కైసర్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న యూనియన్ హోమ్ నుండి మంగళవారం ఉదయం 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. ఘటనపై సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 11:45 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. క్లాస్ రూమ్ గ్రిల్స్ తొలగించి 8 మంది పరారయ్యారు. మిల్క్ బ్రేక్ ఉన్న సమయంలో రెండు గ్రూపులుగా విడిపోయిన బాల నేరస్తులు వార్డెన్‎ను బురుడి కొట్టించి పక్క ప్లాన్ వేసుకుని పరారయ్యారు. మిల్క్ బ్రేక్ రాగానే అక్కడ ఉన్న నేరస్తులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్ క్లాస్ రూమ్‎లో ఉన్న ఒక గ్లాసు బ్రేక్ చేసే బాధ్యతను తీసుకున్నారు. గ్లాస్ బ్రేక్ కావటంతో వార్డెన్ వారిని వారించేందుకు వెళ్లాడు. ఈ తరుణంలోనే మరో గ్రూప్ క్లాస్ రూమ్‎లో ఉన్న గ్రిల్స్‎ను తొలగించేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. ఆ గ్రిల్స్ తొలగిపోగానే ఒకసారిగా గోడ దూకి ఎనిమిది మంది జువైనల్ హోం నుండి పరారయ్యారు.

ఘటన జరిగిన సమయంలో మొత్తం 32 మంది బాలల నేరస్తులు జువైనల్ హోమ్‎లో ఉన్నారు. అయితే వీరందరూ రకరకాల కేసుల్లో నేరాలకు పాల్పడటంతో వారందరినీ జువైనల్ హోమ్‎ ఉంచారు. తప్పిపోయిన ఎనిమిది మంది నేరస్తులు ఇటీవల హుస్సేమీ అలం చంద్రాయన్ గుట్టలో ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. ఇళ్లలో దొంగతనాలతో పాటు కొన్ని ప్రాపర్టీ నేరాలు చేశారు. రెండు కమిషనరేట్‎ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన విధానంపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 8 మంది జువైనెల్స్ పారిపోవడంపై జువైనల్ హోమ్ సూపర్డెంట్ సంగమేశ్వర్ సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తప్పిపోయిన బాల నేరస్తుల కోసం గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటివి ఫుటేజ్‎లను సైతం పరిశీలిస్తున్నారు. మరోవైపు జువైనల్ హోమ్ సూపర్డెంట్ వారి తల్లిదండ్రులకు ఫోన్‎లు చేశారు. పారిపోయిన నేరస్తులు ఇళ్ళలకు వచ్చారా అని ఆరా తీశారు. ఒకవేళ ఇంటికి వచ్చి ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా జువ్వైనల్స్ అధికారులు తల్లిదండ్రులకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌..!
వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌..!
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..
ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌
ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!