Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే ప్లాట్ ఫారం, జనరల్ టికెట్లు.. పూర్తి వివరాలు..

తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, ఇబ్బందులు లేకుండా ప్రయాణించే వీలు రైళ్లలోనే సాధ్యమవుతుంది. కానీ రైలులో ప్రయాణించడానికి సీటు దొరకాలంటే చాలా కష్టం. దాదాపు ఒకటి, రెండు నెలల ముందుగా టికెట్లను రిజర్వేషన్ చేసుకోవాలి. అప్పుడే బోగిలో సీటు దొరికి ప్రశాంతంగా ప్రయాణం చేయగలం. సాధారణ బోగీలలో ప్రయాణించడానికి కూడా అన్ రిజర్వ్ డ్ టికెట్లను ప్రయాణ సమయానికి ముందుగానే స్టేషన్ కు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే ప్లాట్ ఫారం, జనరల్ టికెట్లు.. పూర్తి వివరాలు..
Indian Railways
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 01, 2024 | 7:25 AM

దేశంలో అన్నింటి కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలందరూ ఎక్కువగా తమ గమ్యస్థానాలకు చేరడానికి దీనినే ఎంచుకుంటారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, ఇబ్బందులు లేకుండా ప్రయాణించే వీలు రైళ్లలోనే సాధ్యమవుతుంది. కానీ రైలులో ప్రయాణించడానికి సీటు దొరకాలంటే చాలా కష్టం. దాదాపు ఒకటి, రెండు నెలల ముందుగా టికెట్లను రిజర్వేషన్ చేసుకోవాలి. అప్పుడే బోగిలో సీటు దొరికి ప్రశాంతంగా ప్రయాణం చేయగలం. సాధారణ బోగీలలో ప్రయాణించడానికి కూడా అన్ రిజర్వ్ డ్ టికెట్లను ప్రయాణ సమయానికి ముందుగానే స్టేషన్ కు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.

క్యూలైన్ లో ఇబ్బందులు..

రిజర్వేషన్ బోగీల విషయం పక్కన పెడితే, సాధారణ బోగీలలో ప్రయాణించేవారి పరిస్థితి ఏమిటి? ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అందరూ రిజర్వేషన్ బోగీలలో ప్రయాణించలేదు. కాబట్టి జనరల్ బోగీలో ప్రయాణం తప్పనిసరి. అవి ఎప్పుడు జనాలతో కిక్కిరిసి ఉంటాయి. బోగిలో నిలబడటానికి చోలు ఉంటే చాలని ప్రయాణికులు భావిస్తారు. వీరి అతి పెద్ద సమస్య ఏమిటంటే టికెట్ తీసుకోవడం. జనరల్ టికెట్లను రైల్వే స్టేషన్లలోనే ఇస్తారు. అక్కడ ఎప్పుడూ పెద్ద క్యూ ఉంటుంది. ఒక్కోసారి టికెట్ తీసుకోవడం ఆలస్యమై మనం ఎక్కాల్సిన రైలును కూడా మిస్సవుతుంటాం.

రైల్వే కొత్త రూల్..

ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. యూటీఎస్ మొబైల్ యాప్‌లో అన్ రిజర్వ్ డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా వీటిని పొందవచ్చు. ప్రయాణికుడు తన ఇంటి వద్దే ఉండి ఈ టికెట్లను బుక్ చేసుకునే వీలు కలిగింది.

పరిమితి తొలగింపు..

ప్రయాణికుల సౌలభ్యం కోసం ఔటర్ లిమిట్ జియో-ఫెన్సింగ్ దూరం పరిమితిని రైల్వే శాఖ తొలగించింది. గతంలో ఈ పరిమితి 50 కిలోమీటర్లు ఉండేది. అంటే మొబైల్ లొకేషన్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోని స్టేషన్ నుంచి మాత్రమే ప్రయాణికుడు అన్‌రిజర్వ్ డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్‌ను తీసుకునే వీలుండేది. ఇప్పుడు ఆ పరిమితి తొలగించారు. ఎక్కడి నుంచైనా టికెట్ పొందే అవకాశం కల్పించారు.

యూటీఎస్ యాప్..

అన్ రిజర్వ్ డ్ టిక్కెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ ను ఉపయోగించి ఈ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్ల సహాయంతో టిక్కెట్లు తీసుకోవచ్చు. వాటి కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. యూటీఎస్ యాప్ పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లోకల్ రైళ్లలో తరచుగా ప్రయాణించేవారికి చాలా ఉపయోగంగా మారింది. రిజర్వ్ చేయని టికెట్ల కోసం ఇబ్బందులు తప్పాయి. తద్వారా టికెట్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలను సులభంగా దాటవచ్చు. ఈ యాప్‌ను ప్రస్తుతం 25 శాతం మంది ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు. దీని వినియోగం క్రమంగా పెరుగుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..