21-05-2024
Ravi Kiran
దూరప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కవగా రైళ్లనే ఎంచుకుంటారు. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందుకే ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు.
ఎంత భద్రంగా దాచుకున్నా ప్రయాణ సమయానికి ఒక్కోసారి టికెట్లను పోగొట్టుకుంటుంటారు కొందరు. తీరా రైలు ఎక్కిన తర్వాత టికెట్ కనిపించక ఇబ్బందులు పడతారు. ఇక టీటీ కూడా వారిని టికెట్ లేని ప్రయాణికుడిగానే పరిగణిస్తారు.
ఎంత భద్రంగా దాచుకున్నా ప్రయాణ సమయానికి ఒక్కోసారి టికెట్లను పోగొట్టుకుంటుంటారు కొందరు. తీరా రైలు ఎక్కిన తర్వాత టికెట్ కనిపించక ఇబ్బందులు పడతారు. ఇక టీటీ కూడా వారిని టికెట్ లేని ప్రయాణికుడిగానే పరిగణిస్తారు.
అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా భారతీయ రైల్వే ఓ ప్రత్యామ్నాయ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకోండి.! ఇకపై ఒకవేళ టికెట్ పోయినా.. మీ జర్నీని హ్యాపీగా చేసేయండి.
టికెట్ పోయిన సందర్భంలో ప్రయాణానికి ఇబ్బంది రాకుండా డూప్లికేట్ టికెట్‌ను పొందే వీలును కల్పిస్తోంది. కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డూప్లికేట్ టికెట్ కోసం చార్ట్ ప్రిపేర్ కాకముందే రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేయాలి.
లేదంటే ఛార్ట్ ప్రిపేర్ అవ్వక ముందు, ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. మీ టికెట్ కన్ఫర్మ్ అయి ఛార్ట్ ప్రిపేర్ అవ్వకముందే రైల్వే అధికారులను సంప్రదిస్తే మీకు డూప్లికేట్ టికెట్ జారీ చేస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి క్లరికేజ్ ఛార్జీలు వసూలు చేస్తారు.
ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక చిరిగిన టికెట్ స్థానంలో డూప్లికేట్ టికెట్ కోసం RAC టికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొత్తం ఫేర్‌లో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ టికెట్ దొరికితే ప్రయాణం కంటే ముందే రైల్వే అధికారులకు సమర్పిస్తే 5 శాతం ఛార్జీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే.. IRCTC అకౌంట్‌లోకి వెళ్లి టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.