నీరవ్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్విస్ అకౌంట్స్ సీజ్

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2019 | 3:14 PM

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్‌కు ఈ సారి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. నీరవ్, ఆయన చెల్లిలికి చెందిన నాలుగు స్విస్ బ్యాంక్ అకౌంట్లను ఆ దేశపు అధికారులు సీజ్ చేశారు. ఈ ఖాతల్లో దాదపు రూ. 283.16 కోట్ల డిపాజిట్లతో పాటుగా.. పలు కీలక డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ లావాదేవీల నిరోధక చట్టం కింద ఈ […]

నీరవ్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్విస్ అకౌంట్స్ సీజ్
Follow us on

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్‌కు ఈ సారి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. నీరవ్, ఆయన చెల్లిలికి చెందిన నాలుగు స్విస్ బ్యాంక్ అకౌంట్లను ఆ దేశపు అధికారులు సీజ్ చేశారు. ఈ ఖాతల్లో దాదపు రూ. 283.16 కోట్ల డిపాజిట్లతో పాటుగా.. పలు కీలక డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ లావాదేవీల నిరోధక చట్టం కింద ఈ అకౌంట్లను సీజ్ చేయాలంటూ ఈడీ స్విస్ ప్రభుత్వాన్ని కోరింది. భారత బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సోమ్మును అక్రమంగా స్విస్ అకౌంట్లకు మళ్లించారంటూ ఈడీ పేర్కొంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ. 14 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన నీరవ్.. కొన్ని నెలలుగా లండన్‌లో తలదాచుకుంటున్నాడు. నీరవ్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ విజ్ఞప్తి చేస్తూ.. ఆయనపై రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఆయనను అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉన్న ఆయన… బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. కాగా గత రెండు రోజుల క్రితమే.. ఇదే కేసులో మరో నిందితుడు, నీరవ్ బంధువుకు అంటింగ్వా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. భారత్ కు కూడా త్వరలో అప్పజెప్తామని స్వయానా.. అక్కడి ప్రధాని వెల్లడించారు.