గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ చాలెంజ్.. టాప్ 10లో ముగ్గురు భారతీయులు..

మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి అనువర్తనాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్‌లను ప్రోత్సహించే గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఛాలెంజ్ టాప్ 10 విజేతలలో

గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ చాలెంజ్.. టాప్ 10లో ముగ్గురు భారతీయులు..

Edited By:

Updated on: Jun 23, 2020 | 4:20 PM

Google Android Developer Challenge: మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి అనువర్తనాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్‌లను ప్రోత్సహించే గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఛాలెంజ్ టాప్ 10 విజేతలలో చోటు దక్కించుకున్నారు. ఇందులో భారత్ నుంచి అగ్రోడాక్, లీపీ, ఉనోడాగ్స్ సహా మూడు యాప్‌లకు చోటు దక్కింది.

భారతీయులు అభివృద్ధి చేసిన మూడు అనువర్తనాలు అగ్రోడాక్, లీపి, యునోడాగ్స్. చేతి సైగలు, సంజ్ఞల ఆధారంగా అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకునేలా విద్యార్థులకు సాయపడేందుకు.. బెంగళూరుకు చెందిన ప్రిన్స్ పటేల్ లీపీ యాప్‌ తయారు చేశాడు. పంట తెగుళ్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకునేలా రైతులకు తోడ్పడేందుకు.. కొచ్చికి చెందిన నవనీత్ కృష్ణ అగ్రోడాక్‌ యాప్‌ను రూపొందించారు. ఇక న్యూఢిల్లీకి చెందిన చిన్మయ్ మిశ్రా… పెంపుడు జంతువుల ఆరోగ్యం, యోగక్షేమాలు, ఫిట్‌నెస్‌ విషయంలో యజమానులకు తోడ్పడే విధంగా ఉనోడాగ్స్ అనే యాప్ తయారు చేశాడు.